ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(అక్టోబర్ 30) లాభాల్లో ఉన్నాయి. వరుసగా 2 రోజుల నష్టం అనంతరం అక్టోబర్‌లో చివరి రోజు నేడు నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 50.71 పాయింట్లు(0.13%) నష్టపోయి 39,699.14 వద్ద, నిఫ్టీ 7.90 పాయింట్లు( 0.07%) నష్టపోయి 11,662.90 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 137 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ 11,700 మార్క్ క్రాస్ చేసింది. 554 షేర్లు లాభాల్లో, 285 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 52 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. నేడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ ఫలితాలు విడుదలవుతున్నాయి.

ఫలితాలకు ముందు లాభాల్లో రిలయన్స్
ఉదయం గం.10 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐవోసీ, అదానీ పోర్ట్స్, నెస్ట్లే ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉన్నాయి.
ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ స్టాక్ సానుకూలంగా ఉంది. 0.89 శాతం ఎగిసి రూ.2,045 వద్ద ట్రేడ్ అయింది.
శ్రీరామ్ ట్రాన్సుపోర్ట్ ఫైనాన్స్ సెప్టెంబర్ త్రైమాసిక నికర లాభం 11 శాతం క్షీణించింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో కెనరా బ్యాంకు నికర లాభం రూ.444 కోట్లుగా ఉంది.
ఇండిగో వరుసగా మూడో త్రైమాసికంలో నష్టాలను ప్రకటించింది.
ఎయిరిండియా బిడ్డింగ్ డెడ్ లైన్‌ను డిసెంబర్ 14వ తేదీ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

స్టాక్స్ అన్నీ లాభాల్లో
టీసీఎస్ 1.32 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2 శాతం, ఇన్ఫోసిస్ 0.20 శాతం, టెక్ మహీంద్ర 1.70 శాతం, విప్రో 1.60 శాతం, మైండ్ ట్రీ 2.52 శాతం, కోఫోర్జ్ స్టాక్ 2.56 శాతం లాభపడ్డాయి. ఐటీ స్టాక్స్ అన్నీ లాభాల్లో ఉన్నాయి.
నిఫ్టీ 11,700 పాయింట్లకు పైగా ఎగిసింది.
మారుతీ సుజుకీ ఫలితాల అనంతరం నేడు ఈ స్టాక్ 1 శాతానికి పైగా పడిపోయింది.
వొడాఫోన్ ఐడియా స్టాక్ 3.59 శాతం ఎగిసింది.
టాటా మోటార్స్ 1.52 శాతం లాభపడింది.
నిఫ్టీ ఎనర్జీ 1.76 శాతం లాభాల్లో ఉంది.
నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ.. ఇలా దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఇలా..
అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. అంతకుముందురోజు భారీగా నష్టపోయిన అమెరికా స్టాక్స్ తాజాగా ఎగిశాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావర్జే 139 పాయింట్లు (0.52 శాతం) లాభపడి 26,659.11 వద్ద, ఎస్ అండ్ పీ 39 పాయింట్లు(1.19 శాతం) ఎగిసి 3,310.11 వద్ద, నాస్‌డాక్ కాంపోజిట్ 180 పాయింట్లు (1.64 శాతం) ఎగిసి 11,185.59 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. యూఎస్ వ్యాల్యూమ్ ఎక్స్చేంజ్ 9.74 బిలియన్ షేర్లుగా ఉంది.
ఆసియా మార్కెట్లు కాస్త మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ నిక్కీ 0.8 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ 1.7 శాతం, ఆస్ట్రేలియా ASX200 0.24 శాతం, సింగపూర్ ఎస్జీఎక్స్ 0.22 శాతం క్షీణించాయి. అయితే సౌత్ కొరియా కోస్పి 1 శాతం, భారత్ నిఫ్టీ 70 పాయింట్ల మేర లాభాల్లో ఉంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications