ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (ఫిబ్రవరి 24) భారీ లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ అనంతరం వరుసగా ఐదు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఆ సమయంలో ఏకంగా 2400 పాయింట్ల మేర నష్టపోయింది. కానీ నిన్న, నేడు సూచీలు భారీగా లాభపడ్డాయి. ఈ రెండు రోజుల్లోనే సూచీలు దాదాపు 1500 పాయింట్ల మేర లాభపడింది. నేడు ఒక్కరోజే సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసింది. ఉదయం గం.11.40 సమయంలో నిఫ్టీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ట్రేడింగ్ నిలిచిపోయింది. దీంతో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించారు. సాయంత్రం గం.3.45 గంటలకు సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్‌ను పునఃప్రారంభించారు.

రూ.2.7 లక్షల కోట్ల సంపద పెరిగింది
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.201.38 లక్షల నుండి రూ.204.3 లక్షల కోట్లకు పెరిగింది. నేడు ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 1030 పాయింట్లు లేదా 2.07 శాతం లాభపడి 50,781.69 పాయింట్ల వద్ద, నిఫ్టీ 274 పాయింట్లు లేదా 1.86 ఎగిసి 14,982 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.77 శాతం, 1.08 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ 15,0008 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది.

టాప్ గెయినర్స్ లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో HDFC బ్యాంకు 5.06 శాతం, యాక్సిస్ బ్యాంకు 4.67 శాతం, కోల్ ఇండియా 5.48 శాతం, ICICI బ్యాంకు 4.02 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.33 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో UPL 2.20 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.48 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.33 శాతం, JSW స్టీల్ 1.09 శాతం, TCS 1.08 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, HDFC బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 1.86 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.78 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.25 శాతం, నిఫ్టీ బ్యాంకు 3.80 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.35 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.40 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.20 శాతం, నిఫ్టీ మీడియా 1.45 శాతం, నిఫ్టీ మెటల్ 0.78 శాతం, నిఫ్టీ ఫార్మా 0.05 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.78 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.86 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.87 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ 0.11 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications