కొత్త శిఖరానికి... 47,000 మార్కును క్రాస్ చేసిన సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 47,000 మార్కును క్రాస్ చేసి, ఆ తర్వాత కిందకు వచ్చింది. ఉదయం గం.09:17 సమయానికి సెన్సెక్స్ 36.41 పాయింట్లు(0.08%) లాభపడి 46926.75 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12.30 పాయింట్లు(0.09%) ఎగిసి 13753 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 905 షేర్లు లాభాల్లో, 504 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 71 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
మార్కెట్లు నిన్న భారీ లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. పలు దేశాల్లో కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా కోలుకుంటుండటంతో ఇన్వెస్టర్లు నేడు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఫార్మా స్టాక్స్ కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో మార్కెట్లు వరుసగా ఐదవ రోజు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మొదటిసారి 13,700 పాయింట్లను తాకగా, సెన్సెక్స్ నిన్ననే 47,000 మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది. ఈ రోజు ఆ మార్కును క్రాస్ చేసింది.

నిన్న సెన్సెక్స్ 46,890 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 47,000 దాటింది. ఇదిలా ఉండగా, నేడు టీసీఎస్ బైబ్యాక్ ప్రారంభమవుతోంది. ఈ కంపెనీ 5,33,33,333 ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఇందుకోసం రూ.16,000 కోట్లు వెచ్చించనుంది. షేర్‌కు రూ.3,000 ఫిక్స్ ధరను నిర్ణయించింది. ఈ ఆఫర్ జనవరి 1, 2021న ముగుస్తుంది.


Click it and Unblock the Notifications