ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 19) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. వరుసగా మూడు రోజుల పాటు 800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ నేడు ప్రారంభ సెషన్లో 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం సమయానికి కాస్త తేరుకుంది. అయినప్పటికీ నష్టాల్లోనే ఉంది. బడ్జెట్ అనంతరం మార్కెట్లు జంప్ చేశాయి. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. ఆటో, మెటల్ రంగాలు సూచీలను కిందకు లాగాయి. స్మాల్ క్యాప్స్ ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, మెటల్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

భారీ నష్టాల్లో...
సెన్సెక్స్ నిన్న 51,325 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు ఉదయం 51,238.02 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,432.99 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,039.97 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,074.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,144.05 వద్ద గరిష్టాన్ని, 15,028.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నష్టాల్లోనే ఊగిసలాటలో ఉంది. ఓ సమయంలో 200 పాయింట్ల నష్టాల్లోకి వెళ్ళిన సెన్సెక్స్, ఆ తర్వాత 60 పాయింట్లు లాభపడింది. తిరిగి నష్టాల్లోకి వెళ్లింది. మధ్యాహ్నం గం.12.00 సమయానికి సెన్సెక్స్ 51,206 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్ 4.24 శాతం, GAIL 3.00 శాతం, BPCL 1.64 శాతం, రిలయన్స్ 1.43 శాతం, NTPC 1.26 శాతం లాభపడ్డాయి.టాప్ లూజర్స్ జాబితాలో టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.45 శాతం, బజాజ్ ఆటో 2.08 శాతం, ICICI బ్యాంకు 2.10 శాతం, టాటా స్టీల్ 2.09 శాతం, హీరో మోటో కార్ప్ 1.98 శాతం నష్టపోయాయి.రిలయన్స్, ఎస్బీఐ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ మోస్ట్ యాక్టివ్ జాబితాలో ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.21 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.15 శాతం నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎనర్జీ 0.74 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.12 శాతం, నిఫ్టీ మీడియా 0.21 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.91 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.28 శాతం లాభపడ్డాయి.నిఫ్టీ ఆటో 1.23 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.52 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.64 శాతం, నిఫ్టీ ఐటీ 0.67శాతం, నిఫ్టీ మెటల్ 0.02 శాతం, నిఫ్టీ ఫార్మా 0.81 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.17 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications