For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 59,000 పాయింట్లకు పైనే

|

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ వారం బడ్జెట్‌కు ముందు, బడ్జెట్ తర్వాత భారీగా లాభపడిన సూచీలు, నేడు (ఫిబ్రవరి 3) నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిన్న 59,000 పాయింట్ల మార్కును దాటింది. నేడు నష్టపోయినప్పటికీ, 59,000కు పైనే ఉంది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.40 సమయానికి -416.81 (0.70%) పాయింట్లు నష్టపోయి, 59,141.52 పాయింట్ల వద్ద, నిఫ్టీ 97.90 (0.55%) పాయింట్లు క్షీణించి 17,662.50 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

సెన్సెక్స్ 59,528.16 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,557.87 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,197.98 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,767.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,781.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,678.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు 59,000 పాయింట్ల దిగువకు మాత్రం రాలేదు. బడ్జెట్‌కు ముందు, తర్వాత సూచటీలు భారీగా ఎగిసిపడటంతో నేడు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది.

 Sensex hovers around 59,300, Nifty gives up 17,700

బీఎస్ఈలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ అత్యధికంగా లాభపడ్డాయి. మెటల్ రంగ సూచీలు అత్యధికంగా నష్టపోయాయి. వారాంతపు ఎఫ్ అండ్ వో ముగింపు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు డౌజోన్స్ 0.06 శాతం, నాస్‌డాక్ 0.5 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.9 శాతం లాభపడ్డాయి.

English summary

ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 59,000 పాయింట్లకు పైనే | Sensex hovers around 59,300, Nifty gives up 17,700

Domestic markets started Thursday’s trading session with losses. S&P BSE Sensex was down over 100 points or 0.17% at 59,455 while NSE Nifty 50 slipped 25 points or 0.15% to trade at 17,750.
Story first published: Thursday, February 3, 2022, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X