ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు: ఐటీ స్టాక్స్ డౌన్, రిలయన్స్ రూ.1900కు దిగువన
ముంబై: వరుసగా ఐదు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న 47వేల కిందకు పడిపోయిన సెన్సెక్స్, నేడు ఆ మార్కును దాటింది. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 343.50 పాయింట్లు లేదా 0.73% పెరిగి 47,217.86 పాయింట్ల వద్ద, నిఫ్టీ 102.90 పాయింట్లు లేదా 0.74% ఎగిసి 13,920.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 928 షేర్లు లాభాల్లో, 203 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 26 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం కలిసి వచ్చింది. ప్రభుత్వం నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ దిశగా దృష్టి సారించారు.

ఊగిసలాటలో మార్కెట్
సెన్సెక్స్ నేడు భారీ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత ఉదయం గం.10.30 సమయానికి నష్టాల్లోకి వెళ్లింది. ఉదయం సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు లాభపడి 47,423.47 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 47,423.66 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. 46,738 వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.45 సమయానికి 25 పాయింట్ల నష్టాల్లో ఉంది. నిఫ్టీ కూడా 130 పాయింట్ల లాభంతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. కాసేపటికే సెన్సెక్స్, నిఫ్టీ అతి స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌కు ముందు ఊగిసలాట కనిపిస్తోంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు 3.87 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 3.85 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.26 శాతం, IOC 1.46 శాతం, టాటా మోటార్స్ 1.42 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 2.75 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.01 శాతం, HUL 1.31 శాతం, NTPC 1.20 శాతం, UPL 1.00 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు 0.55 శాతం లాభపడినప్పటికీ రూ.1900కు దిగువనే ఉంది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.16 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.96 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.61 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.54 శాతం,
నిఫ్టీ ఎనర్జీ 0.21 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.90 శాతం, నిఫ్టీ మీడియా 0.83 శాతం, నిఫ్టీ మెటల్ 0.13 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.81 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.82 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.64 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 0.37 శాతం, నిఫ్టీ ఫార్మా 0.78 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications