For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త రికార్డుకు సెన్సెక్స్, వరుసగా నాలుగో రోజు లాభాల్లో నిఫ్టీ

|

ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 54,000 సమీపంలో ముగిసింది. నిఫ్టీ కూడా 16,375 పాయింట్లకు చేరువైంది. ఉదయం మంచి లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను కిందకు పడిపోలేదు. అంతకంతకూ కాస్త పైకెగిశాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 92 పాయింట్లు ఎగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.25 వద్ద ఉంది.

సెన్సెక్స్ 54,641.22 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,874.10 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,536.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,303.65 పాయింట్లు ఎగిసి, 16,375.50 పాయింట్లు ఎగిసి, 16,286.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 318.05 (0.58%) పాయింట్లు ఎగిసి 54,843.98 పాయింట్ల వద్ద, నిఫ్టీ 82.15 (0.50%) పాయింట్లు లాభపడి 16,364.40 పాయింట్ల వద్ద ముగిసింది.

Sensex hits fresh record high, Nifty up for 4th day

ఉదయం 54,669 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ప్రారంభంలో స్వల్ప ఒడుదొడుకులు ఎదుర్కొంది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, HCL టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ షేర్స్ లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు రాణించాయి. నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 6.04 శాతం, టెక్ మహీంద్రా 4.76 శాతం, టాటా మోటార్స్ 3.57 శాతం, HCL టెక్ 2.77 శాతం, లార్సన్ 2.54 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 3.74 శాతం, గ్రాసీమ్ 0.67 శాతం, ఓఎన్జీసీ 0.64 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.60 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 0.56 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ 16500 పాయింట్ల దిశగా సాగుతోంది. సెన్సెక్స్ 55000 పాయింట్లకు చేరువైంది. ఎడెల్విస్ వెల్త్ మేనేజ్‌మెంట్ 1 బిలియన్ డాలర్ల మేర ఫండ్స్ సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. హెస్టెర్ బయోసైన్స్ బలమైన Q1FY22 ఫలితాల అనంతరం పన్నెండు శాతం లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా నేడు లాభాల్లో ముగిశాయి.

English summary

సరికొత్త రికార్డుకు సెన్సెక్స్, వరుసగా నాలుగో రోజు లాభాల్లో నిఫ్టీ | Sensex hits fresh record high, Nifty up for 4th day

BSE Sensex surged 318.05 points or 0.58 per cent to end at 54,843.98. NSE's Nifty rallied 82 points or 0.5 per cent to settle at 16,364.
Story first published: Thursday, August 12, 2021, 18:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X