సరికొత్త రికార్డును తాకిన సూచీలు: ప్రాఫిట్ బుకింగ్‌తో IRCTC షేర్ డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఆగస్ట్ 13) పరుగులు పెట్టాయి. గత కొద్ది రోజులుగా సూచీలు ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. గతవారం 54,000 మార్కు క్రాస్ చేసిన సెన్సెక్స్ నేడు ఏకంగా 55,000 పాయింట్లను దాటి మరో కొత్త రికార్డ్ సృష్టించింది. శుక్రవారం ఉదయం గం.9.30 సమయానికి సెన్సెక్స్ 225 పాయింట్లు లాభపడి 55,068 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా 70 పాయింట్లు లాభపడి 16,435 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత ఏ దశలోను సూచీలు కిందకు పడిపోలేదు. పైగా అంతకంతకూ పైపైకి కదిలాయి. సెన్సెక్స్ చివరకు +593.31 (1.08%) పాయింట్లు ఎగిసి 55,437.29 పాయింట్ల వద్ద, నిఫ్టీ 164.70 (1.01%) పాయింట్లు లాభపడి 16,529.10 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.27 వద్ద ట్రేడ్ అయింది.
54,911.95 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 55,487.79 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,905.49 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 16,385.70 పాయింట్లు వద్ద ప్రారంభమై నిఫ్టీ, 16,543.60 వద్ద గరిష్టాన్ని, 16,376.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఐటీ స్టాక్స్ అదరగొట్టాయి. ఫార్మా రంగం మినహా మిగతా స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఐటీ 1 శాతం మేర లాభపడగా, బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.

ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం(IRCTC) స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటించింది. తమ షేర్లను ఐదు ఈక్విటీ షేర్లుగా విభజించనున్నట్లు తెలిపింది. గురువారం IRCTC త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ సందర్భంగా షేర్ స్ప్లిట్‌ను ప్రకటించింది. IRCTC లిస్టింగ్ అయినప్పటి నుండి 734 శాతం మేర లాభపడింది. ఐపీవో ధర రూ.320గా ఉండగా, ప్రస్తుతం ఈ స్టాక్ రూ.2668గా ఉంది. గత త్రైమాసికంలో IRCTC రూ.82 కోట్ల ప్రాఫిట్‌ను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో IRCTC రూ.24 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. IRCTC ఆపరేషన్స్ రెవెన్యూ 85 శాతం పెరిగి రూ.243 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.131 కోట్లకు చేరుకుంది.
IRCTC షేర్ ధర నిన్న రికార్డ్ గరిష్టాన్ని తాకింది. స్టాక్ స్ప్లిట్ అనంతరం ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కోసం ఎగబడ్డారు. దీంతో నిన్న రూ.2,690 వద్ద క్లోజ్ అయిన IRCTC షేర్ నేడు రూ2664 వద్ద ముగిసింది. దాదాపు 1 శాతం మేర క్షీణించింది. నేడు రూ.2638 వద్ద కనిష్టాన్ని తాకింది.


Click it and Unblock the Notifications