సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ: మార్కెట్లు పైకి... రిలయన్స్ కిందకు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(జనవరి 4) లాభాల్లో ప్రారంభమయ్యాయి. మెటల్, బ్యాంకింగ్, ఐటీ షేర్లు షైన్ అయ్యాయి. డీసీజీఐ రెండు కరోనా టీకాలకు అనుమతులు మంజూరు చేయడంతో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. దీంతో సెన్సెక్స్ మొదటిసారి ఆల్ టైమ్ హైకి రూ.48,000 మార్కు దాటింది. నిఫ్టీ 14,100 మార్కును దాటింది. గతవారం సెన్సెక్స్ 48000 పాయింట్లకు చేరువలో రెండుసార్లు నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మార్కును క్రాస్ చేసింది.

సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టానికి
నేడు ఉదయం మార్కెట్లు మంచి లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 236.65 పాయింట్లు(0.49%) లాభపడి 48,105.63 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74.40 పాయింట్లు(0.53%) ఎగిసి 14,092.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 1374 షేర్లు లాభాల్లో, 223 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 50 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి నేడు బలపడింది. 18 పైసలు ఎగబాకి 73.94 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. చాలా నెలల తర్వాత రూపాయి 93 దిగువకు వచ్చింది. శుక్రవారం 73.12 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 3.65 శాతం, టాటా స్టీల్ 3.42 శాతం, బీపీసీఎల్ 2.87 శాతం, ఐచర్ మోటార్స్ 2.56 శాతం, టాటా మోటార్స్ 2.23 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా 1.25 శాతం, హీరో మోటో కార్ప్ 1.05 శాతం, అదానీ పోర్ట్స్ 0.50 శాతం, HDFC 0.46 శాతం, బజాజ్ పైనాన్స్ 0.42 శాతం లాభపడ్డాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ ఉన్నాయి.
మార్కెట్లు కొత్త శిఖరాలకు చేరుకుంటుండగా, మార్కెట్ క్యాప్ పరంగా దేశంలోనే పెద్ద సంస్థ రిలయన్స్ మాత్రం పడిపోతోంది. నేడు 0.83 శాతం క్షీణించిన స్టాక్ 1971 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.21 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.84 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.60 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.21 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.18 శాతం, నిఫ్టీ ఐటీ 0.47 శాతం, నిఫ్టీ మెటల్ 2.23 శాతం, నిఫ్టీ ఫార్మా 0.55 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.60 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.70 శాతం, నిఫ్టీ మీడియా 0.55 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.28 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.03 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.45 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications