ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(నవంబర్ 17) సరికొత్త రికార్డును తాకింది. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 319.77 పాయింట్లు (0.73%) లాభపడి 43,957.75 వద్ద, నిఫ్టీ 82.20 పాయింట్లు(0.64%) ఎగిసి 12,862.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 866 షేర్లు లాభాల్లో, 330 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 99 షేర్లలో ఎలాంటి మార్పులేదు. శుక్రవారం డాలర్ మారకంతో రూపాయి 74.60 వద్ద క్లోజ్ అయింది. ఈరోజు 17 పైసలు బలపడి 74.43 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ మెటల్ 2 శాతం ఎగిసింది. ఐటీ, ఫార్మా స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

44,000 మార్క్ దాటిన సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు ఓ దశలో 44,000 మార్కును దాటింది. గతవారం 43వేల మార్క్ దాటి రికార్డును సృష్టించిన సెన్సెక్స్ పది సెషన్లల లోపే 44వేల మార్కును అందుకోవడం గమనార్హం. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో నిలువలేకపోయింది. ఓ సమయంలో 44,161ని తాకింది. క్రితం సెషన్‌లో 43,831 వద్ద క్లోజ్ అయింది. మధ్యాహ్నం గం.12 సమయానికి 155 పాయింట్లు లాభపడి 43,793 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 44 పాయింట్లు ఎగిసి 12,824 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా 12,930ని తాకింది.

లాభాల్లో ఫైనాన్షియల్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ డౌన్
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6.86 శాతం, టాటా మోటార్స్ 3.96 శాతం, ఎస్బీఐ 3.03 శాతం, లార్సన్ 2.90 శాతం, HDFC లైఫ్ 2.63 శాతం ఎగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో BPCL 4.05 శాతం, హీరో మోటో కార్ప్ 2.83 శాతం, IOC 1.96 శాతం, NTPC 1.98 శాతం, ఓఎన్జీసీ 1.65 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.36 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.13 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.97 శాతం, నిఫ్టీ మెటల్ 2.50 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.28 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.23 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.98 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎనర్జీ 0.39 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.20 శాతం, నిఫ్టీ ఐటీ 0.35 శాతం, నిఫ్టీ మీడియా 1.17 శాతం, నిఫ్టీ ఫార్మా 0.54 శాతం నష్టపోయాయి.
ఐటీ స్టాక్స్ డీలా పడ్డాయి. టీసీఎస్ 0.23 శాతం, టెక్ మహీంద్ర 0.42 శాతం, విప్రో 1.17 శాతం, మైండ్ ట్రీ 0.62 శాతం లాభపడ్డాయి.
హెచ్‌సీఎల్ టెక్ 1.60 శాతం, ఇన్ఫోసిస్ 1.38 శాతం, కోఫోర్జ్ 1.03 శాతం నష్టపోయింది.

అందుకే మార్కెట్లు జంప్
పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ వ్యాక్సీన్ పైన వివిధ ఫార్మా దిగ్గజాల ప్రకటన మార్కెట్లకు సరికొత్త ఊపిరులూదుతోంది. ఇప్పటికి మూడు నాలుగు ఫార్మా సంస్థలు తమ ట్రయల్స్ 90 శాతం అంతకుమించి ఫలితాలు సాధించినట్లు వెల్లడించాయి. ఇక, మన దేశంలో కరోనా కేసులు తగ్గడంతో పాటు రికవరీ రేటు భారీగా పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు వేగవంతంగా పుంజుకుంటున్న సంకేతాలు రావడంతో పాటు రేటింగ్ ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. ఇది మార్కెట్ల దూకుడుకు కారణమైంది.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications