ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (నవంబర్ 10) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 228.11 పాయింట్లు (0.54%) ఎగిసి 42,825.54 వద్ద, నిఫ్టీ 62.40 పాయింట్లు (0.50%) పెరిగి 12,523.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 458 పాయింట్లు ఎగిస 43,057 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
718 షేర్లు లాభాల్లో, 294 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 48 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని స్టాక్స్ కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒత్తిడిలో ఉంది. డాలర్ మారకంతో రూపాయి 8 పైసలు బలపడి 74.06 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం సెషన్‌లో 74.14 వద్ద ముగిసింది.

వ్యాక్సీన్ ప్రకటనతో...
ఉదయం గం.11 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 5.99 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 5.45 శాతం, ఎస్బీఐ 4.53 శాతం, లార్సన్ 4.36 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.96 ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా 4.82 శాతం, టెక్ మహీంద్ర 4.27 శాతం, ఇన్ఫోసిస్ 3.39 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.29 శాతం, నెస్ట్లే 2.40 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.
తమ టీకా ఫలితాలు 90 శాతం సానుకూలంగా వచ్చాయని ప్రకటించడంతో నేడు ఆ షేర్లు ర్యాలీ చేశాయి. ఓ దశలో 19 శాతం ఎగిసింది. అదే విధంగా మార్కెట్లు నేడు కూడా అదే బలంతో ముందుకు సాగుతున్నాయి.
ఫైజర్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు బలం చేకూర్చింది. దీంతో మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి.

రంగాలవారీగా.. ఐటీ స్టాక్స్ డౌన్
నిఫ్టీ ఆటో 0.26 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.88 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.19 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.93 శాతం, నిఫ్టీ మీడియా 1.95 శాతం, నిప్టీ మెటల్ 1.12 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.08 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.22 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.03 శాతం ఎగిశాయి.
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.90 శాతం, నిఫ్టీ ఐటీ 2.98 శాతం, నిఫ్టీ ఫార్మా 2.05 శాతం నష్టపోయాయి.ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 1.86 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.32 శాతం, ఇన్ఫోసిస్ 3.37 శాతం, టెక్ మహీంద్ర 4.32 శాతం, విప్రో 2.13 శాతం, మైండ్ ట్రీ 4.18 శాతం, కోఫోర్జ్ 2.83 శాతం మేర నష్టపోయాయి.

నిఫ్టీ దిగ్గజాల్లో..
నిఫ్టీ దిగ్గజాల్లో ఐసీఐసీఐ, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, గెయిల్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, గ్రాసిమ్, ఐవోసీ, శ్రీసిమెంట్, యాక్సిస్ 3-1 శాతం మధ్య ఎగిశాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, సిప్లా, దివిస్, మారుతీ, డాక్టర్ రెడ్డీస్ 4-0.6 శాతం మధ్య క్షీణించాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications