దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(నవంబర్ 9) భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్ విజయం నేపథ్యంలో అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు కూడా దూసుకెళ్లాయి. బిడెన్ గెలుపును ఇన్వెస్టర్లు స్వాగతించినట్లుగా మార్కెట్ జోరును చూస్తే అర్థమవుతోంది. నేడు సెన్సెక్స్ 704.37 పాయింట్లు(1.68%) ఎగిసి 42,597.43 వద్ద, నిఫ్టీ 197.50 పాయింట్లు(1.61%) లాభపడి 12,461 పాయింట్ల వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో
కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా రోజులుగా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. లాక్ డౌన్ అనంతరం కోలుకున్నప్పటికీ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకేందుకు నెలలు పట్టింది. తాజాగా ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకడంతో పాటు దానిని దాటేసింది. జోబిడెన్ విజయం, అమెరికాలో త్వరలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన వెలువడనుందనే సంకేతాలు ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. బిడెన్ హయాంలో భారత ఐటీ కంపెనీలకు శుభవార్త ఉంటుందని భావిస్తున్నందున ఐటీ, ఫైనాన్షియల్ షేర్లు రాణించాయి.

ఇన్వెస్టర్లలో ఉత్సాహం
దేశీయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి ఐటీ కంపెనీలకు జోబిడెన్ శుభవార్త చెబుతారనే అంచనాలతో పాటు దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కడం ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, విద్యుత్ డిమాండ్ పెరగడం వంటివి కరోనా, ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న భయాలను తొలగించేలా చేశాయి. దీంతో వరుసగా ఆరోరోజు మార్కెట్లు దూసుకెళ్లాయి.

ఆసియా మార్కెట్ల దూకుడు
ఆసియా మార్కెట్లయిన షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జపాన్ నిక్కీ 2 శాతం, ఆస్ట్రేలియా ఎక్స్‌జేవో మార్కెట్లు 1.75 శాతం, సౌత్ కొరియా కోస్పి 1.27 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్‌షెంగ్ 1.17 శాతం, షాంగై కాంపోజిట్ 1.85 శాతం, తైవాన్ సూచీలు 1.18 శాతం, సింగపూర్ సూచీలు 1.19 శాతం, ఇండోనేషియా సూచీలు 0.38 శాతం ఎగిశాయి. యూరోప్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అయితే భారీగా ఎగిసిన మార్కెట్లు ఈ ఒరవడిని కొనసాగిస్తాయా లేదా అనేది ప్రశ్నే అంటున్నారు. జోబిడెన్ గెలుపు నేపథ్యంలో మార్కెట్లు అనూహ్యంగా పుంజుకోగా.. రానున్న రోజుల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications