ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబ్ 22) స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 166.03 పాయింట్లు(0.36%) లాభపడి 45719.99 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51.10 పాయింట్లు(0.38%) ఎగిసి 13379.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 855 షేర్లు లాభాల్లో, 638 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 65 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఉదయం గం.10 సమయానికి సెన్సెక్స్ 140 పాయింట్లు క్షీణించింది. ఉదయం నుండి సెన్సెక్స్ నష్టాల్లోనే ఉంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేడు టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 2.22 శాతం, HCL టెక్ 2.25 శాతం, టెక్ మహీంద్రా 1.92 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.91 శాతం, సన్ ఫార్మా 1.34 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.31 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.20 శాతం, IOC 1.32 శాతం, HDFC బ్యాంకు 1.39 శాతం, మారుతీ సుజుకీ 1.05 శాతం ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా మోటార్స, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

రిలయన్స్ డౌన్
అత్యధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు 1 శాతం క్షీణించి రూ.1918కి పడిపోయింది. మార్కెట్ క్యాప్ పరంగా రెండో కంపెనీ టీసీఎస్ స్టాక్ 0.59 శాతం లాభపడి రూ.2836 వద్ద ట్రేడ్ అయింది. డాలర్ మారకంతో రూపాయి 16 పైసలు క్షీణించి 73.95 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 73.78 వద్ద క్లోజ్ అయింది.
డైలీహంట్ యూనీకార్న్ జాబితాలోకి వచ్చింది. ఫండింగ్ రౌండ్‌లో 100 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.25 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.50 శాతం నష్టపోయాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.76 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.61 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.18 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.94 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.63 శాతం, నిఫ్టీ మీడియా 2.03 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.64 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.05 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.57 శాతం నష్టపోయాయి
నిఫ్టీ ఐటీ 0.79 శాతం, నిఫ్టీ మెటల్ 0.05 శాతం, నిఫ్టీ ఫార్మా 0.53 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications