ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం(అక్టోబర్ 21) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.32 సమయానికి సెన్సెక్స్ 371.23 పాయింట్లు(0.92%) ఎగిసి 40,915.60 వద్ద, నిఫ్టీ 104.20 పాయింట్లు(0.88%) లాభపడి 12,001 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.11.54 సమయానికి సెన్సెక్స్ 373 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది.
ఓ సమయంలో 40,950 పాయింట్ల సమీపానికి వచ్చింది. 1,126 షేర్లు లాభాల్లో, 401 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 63 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి73.41 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం సెషన్‌లో 73.46 వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్.. లూజర్స్
మధ్యాహ్నం గం.11.45 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్, అదానీ పోర్ట్స్, హిండాల్కో, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బ్రిటానియా, హీరో మోటో కార్ప్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌యూఎల్ ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ జాబితాలో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.
ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది.

ఫలితాలు బాగున్నా షేర్లు డౌన్
బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ రెండో త్రైమాసికం ఫలితాల తర్వాత ఈ స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడిలోకి వెళ్లింది. దీంతో రెండోరోజు బ్రిటానియా షేర్ పడిపోయింది. మధ్యాహ్నం సమయానికి 1.90 శాతం నష్టపోయి రూ.3,485 వద్ద ట్రేడ్ అయింది.
హిందూస్తాన్ యూనీ లీవర్ (HUL) స్టాక్స్ కూడా ఫలితాల తర్వాత నేడు క్షీణించాయి. ఈ స్టాక్ 0.56 శాతం పడిపోయింది.
ఎల్ అండ్ టీ సెప్టెంబర్ ఫలితాలు అంచనాలు మించాయి. ఈ స్టాక్స్ మాత్రం 6 శాతం పుంజుకున్నాయి.
వొడాఫోన్ ఐడియా షేర్ ఈ రోజు మళ్లీ క్షీణించింది.
వేదాంత, యస్ బ్యాంకు, టాటా మోటార్స్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్స్ 1 శాతం నుండి 3 శాతానికి పైగా లాభాల్లో ట్రేడ అయ్యాయి.

హెచ్‌డీఎఫ్‌సీ జోరు
టీసీఎస్ షేర్ 0.66 శాతం, హెచ్‌సీఎల్ టెక్ షేర్ 0.43 శాతం, టెక్ మహీంద్ర షేర్ 0.24 శాతం, విప్రో షేర్ 0.22 శాతం, మైండ్ ట్రీ షేర్ 0.58 శాతం నష్టపోగా,
ఇన్ఫోసిస్ షేర్ 0.87 శాతం, కోఫోర్జ్ స్టాక్స్ మాత్రం 1.12 శాతం మేర లాభపడింది.
రిలయన్స్ షేర్ 0.31 శాతం లాభపడి రూ.2,162.55 వద్ద ట్రేడ్ అవుతోంది.
రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలు రావడంతో హెచ్‌డీఎఫ్‌సీషేర్ ధర మూడు సెషన్లుగా లాభాల్లో కొనసాగుతోంది. ఈ రోజు 1.82 శాతం లాభంతో ట్రేడ్ అవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్టాక్స్ 1.33 శాతం పెరిగి రూ.1,240 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..

హెచ్‌డిఎఫ్‌సి షేర్లు భారీగా పతనం.. చైర్మన్ రాజీనామాతో పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. గంటల వ్యవధిలో రూ. 9 లక్షల కోట్లు ఆవిరి.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు..

స్టాక్ మార్కెట్లో అతి పెద్ద బ్లాక్ డీల్.. 16 లక్షల టాటా షేర్లను అమ్మేసిన Radhakishan Damani..ఎందుకంటే..

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications