భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, ఐటీ స్టాక్స్ జంప్: రిలయన్స్ ఏజీఎంపై దృష్టి
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం భారీలాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమై, చివరకు లాభాల్లో ముగిశాయి. నేడు ఉదయం నుండి అంతకంతకూ ఎగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఏకంగా 1 శాతం వరకు లాభపడ్డాయి. ఇంధన డిమాండ్ తగ్గడంతో చమురు, గ్యాస్ స్టాక్స్ అర శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మరోవైపు, రిలయన్స్ ఏజీఎం పైన అందరి దృష్టి నెలకొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చేసే ప్రకటన వైపు అందరు చూస్తున్నారు.

భారీ లాభాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ ఉదయం 52,514.57 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,615.03 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,385.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,737.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,762.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,702.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.00 సమయానికి +218.41 (0.42%) పాయింట్లు లాభపడి 52,524.49 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 54.10 (0.34%) పాయింట్లు లాభపడి 15,741.05 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టీసీఎస్ 253 శాతం, ఇన్ఫోసిస్ 2.28 శాతం, లార్సన్ 1.58 శాతం, JSW స్టీల్ 1.44 శాతం, మారుతీ సుజుకీ 1.10 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.77 శాతం, ఐచర్ మోటార్స్ 1.20 శాతం, రిలయన్స్ 1.17 శాతం, సిప్లా 1.17, అదానీ పోర్ట్స్ 1.14 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, HDFC బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.35 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.31 శాతం నష్టపోయింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.22 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.36 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.24 శాతం, నిఫ్టీ ఐటీ 1.58 శాతం, నిఫ్టీ మెటల్ 0.58 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.31 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎనర్జీ 1.16, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.02 శాతం, నిఫ్టీ మీడియా 0.69 శాతం, నిఫ్టీ ఫార్మా 0.52 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.77 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.53 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications