ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జూన్ 9) లాభాల్లో ప్రారంభమయ్యాయి. స్వల్ప లాభాలతో స్తబ్దుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం సూచీలకు కాస్త ఊరట అయినప్పటికీ స్తబ్దుగా ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

స్వల్ప లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 52,401.41 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,446.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,204.99 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.30 సమయానికి 104.03 (0.20%) పాయింట్లు ఎగిసి 52,377.26 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,766.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,792.95 గరిష్టాన్ని, 15,723.10 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం సమయానికి 42.70 (0.27%) పాయింట్లు లాభపడి 15,782.30 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ 3.74 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.40 శాతం, కోల్ ఇండియా 2.31 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 2.29 శాతం,
హెచ్‌సీఎల్ టెక్ 1.53 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 1.38 శాతం, మారుతీ సుజుకీ 1.15 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.08 శాతం, బజాజ్ ఆటో 0.81 శాతం, లార్సన్ 0.73 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.28 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.23 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.59 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.59 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.59 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.39 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.18 శాతం, నిఫ్టీ ఐటీ 0.52 శాతం, నిఫ్టీ మీడియా 0.79 శాతం, నిఫ్టీ మెటల్ 0.53 శాతం, నిఫ్టీ ఫార్మా 0.55 శాతం, నిఫ్టీ PSU బ్యాంకు 1.35 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.00 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.50 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications