ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (మే 10) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమై మార్కెట్లు ఆ తర్వాత అంతకంతకూ ఎగిశాయి. సెన్సెక్స్ 50,000 పాయింట్ల దిశగా వెళ్తుండగా, నిఫ్టీ 15,000 పాయింట్లకు 50 పాయింట్ల దూరంలో ఉంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగాయి. ఇవి సూచీలకు అండగా నిలిచాయి. అదే సమయంలో భారీ స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మెజారిటీ రాష్ట్రాల్లో లాక్‌డౌన్, అంతర్జాతీయ సంస్థలు భారత జీడీపీ అంచనాల్లో కోత విధించడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ప్రభావం చూపించవచ్చు.

సూచీలు జంప్
సెన్సెక్స్ ఉదయం 49,496.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,617.47 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,412.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.46 సమయానికి సెన్సెక్స్ 342.30 (0.70%) పాయింట్లు ఎగిసి 49,548 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,928.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,965.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,892.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.48 సమయానికి నిఫ్టీ +123.80 (0.84%) పాయింట్లు ఎగిసి 14,947 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 5.52 శాతం, యూపీఎల్ 5.41 శాతం, హిండాల్కో 5.05 శాతం, లార్సన్ 3.67 శాతం, ఐవోసీ 3.59 శాతం లాభాల్లో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్ 1.96 శాతం, శ్రీసిమెంట్స్ 1.94 శాతం, బ్రిటానియా 1.21 శాతం, ఇన్ఫోసిస్ 0.81 శాతం, హీరో మోటో కార్ప్ 0.76 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, హిండాల్కో, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.86 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.17 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 1.11 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.79 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.17 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.89 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.36 శాతం, నిఫ్టీ ఐటీ 0.01 శాతం, నిఫ్టీ మీడియా 2.05 శాతం, నిఫ్టీ మెటల్ 2.74 శాతం, నిఫ్టీ ఫార్మా 2.97 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.68 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.01 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.75 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications