సెన్సెక్స్ 478 పాయింట్లు జంప్, ఇండస్‌ఇండ్ బ్యాంకు 12% పతనం

స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 8) లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండు వారాలు నష్టపోయిన మార్కెట్లు దీపావళి వారం లాభాల్లో ముగిశాయి. ఈ వారం కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 0.90 మేర లాభపడ్డాయి. నేడు ఫార్మా రంగం మాత్రమే నష్టాల్లో ముగిసింది. మిగతా అన్ని కూడా లాభపడ్డాయి. పీఎస్‌యు బ్యాంకు, ఐటీ, మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ సూచీలు ఒక శాతం నుండి రెండు శాతం మేర లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 1.2 శాతం, స్మాల్ క్యాప్ 0.78 శాతం ఎగిసింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, జేకే బ్యాంకులు భారీగా లాభపడంతో నిఫ్టీ పీఎస్‌యు బ్యాంకు ఒక శాతం మేర లాభపడింది. నిఫ్టీ మెటల్ కూడా ఒక శాతం ఎగిసింది. FY22లో భారత జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని బ్రిక్ వర్క్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. విజిల్ బ్లోయర్స్ కేసు నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్స్ భారీగా నష్టపోయాయి.

ఇండస్ఇండ్ బ్యాంకు విజిల్ బ్లోయర్ ఎఫెక్ట్

ఇండస్ఇండ్ బ్యాంకు విజిల్ బ్లోయర్ ఎఫెక్ట్

ఇండస్ఇండ్ బ్యాంకులో రుణాల పునరుద్ధరణపై విజిల్ బ్లోయర్స్ చేసిన ఆరోపణలు దానిపై సంస్థ ఇచ్చిన వివరణ నేపథ్యంలో బ్యాంకు షేర్లు ఓ దశలో 12 శాతానికి పైగా కుంగాయి. బీఎస్ఈలో స్టాక్ ధర 12.40 శాతం కుంగి రూ.1,041.60కు చేరుకుంది. ఎన్‌ఎస్ఈలో రూ.12.40 శాతం పతమైంది. మధ్యాహ్నం 12:36 గంటల సమయంలో కనిష్ఠాల నుండి స్వల్పంగా కోలుకున్నప్పటికీ 10.52 శాతం నష్టంతో రూ.1,063.95 శాతం వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంకు షేర్ 52 వారాల గరిష్టం రూ.1,242.00, 52 వారాల కనిష్టం రూ.735.05.

సెన్సెక్స్ 478 పాయింట్లు జంప్

సెన్సెక్స్ 478 పాయింట్లు జంప్

సెన్సెక్స్ నేడు 60,385.76 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,609.16 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,779.19 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,040.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,087.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,836.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 477.99 (0.80%) పాయింట్లు ఎగిసి 60,545.61 పాయింట్ల వద్ద, నిఫ్టీ 151.75 (0.85%) పాయింట్లు ఎగిసి 18,068.55 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 సూచీలో 22 షేర్లు లాభపడ్డాయి. రాణించిన వాటిలో టైటాన్ అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్, HDFC, NTPC, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, ఎస్బీఐ, మారుతీ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

అందుకే మార్కెట్లు జంప్

అందుకే మార్కెట్లు జంప్

ఉదయం నుండి ఊగిసలాటలో పయనించిన మార్కెట్లు మధ్యాహ్నం పూర్తిగా లాభాల్లోకి వచ్చాయి. బజాజ్ ఫిన్ సర్వ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, HDFC, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టైటాన్ వంటి దిగ్గజ కంపెనీలకు కొనుగోళ్లు వెల్లువెత్తాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ఠాల నుండి ఓ దశలో ఏకంగా 800 పాయింట్లకు పైగా పుంజకుంది.

పండగ సీజన్ నేపథ్యంలో రిటైల్ విక్రయాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. దీంతో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. వీటితో పాటు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కలిసి వచ్చాయి. పెట్రోల్ ధరల తగ్గింపు, అమెరికాలో ఉద్యోగ కల్పన పుంజుకోవడం వంటి పరిణామాలు కూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+