For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా మోటార్స్ ఎఫెక్ట్, భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

|

స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఏ దశలోను క్షీణించలేదు. పైగా అంతకంతకూ కాస్త ముందుకు సాగాయి. ఈ రోజు స్టాక్ ర్యాలీలో టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్ కీలకంగా నిలిచింది. టీపీజీ డీల్ అనంతరం టాటా మోటార్స్ షేర్ హోల్డర్లపై సిరుల వర్షం కురిసింది. సంస్థకు చెందిన విద్యుత్ వాహన విభాగంలోకి బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఈ స్టాక్ ఓ సమయంలో 22 శాతం లాభపడి రూ.523కు చేరుకుంది. తర్వాత స్వల్పంగా తగ్గినప్పటికీ చివరకు 21.11 శాతం లాభపడి రూ.509 వద్ద ముగిసింది.

గరిష్టాల వద్ద

గరిష్టాల వద్ద

సెన్సెక్స్ నేడు 60,619.91 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,836.63 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,452.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,097.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,197.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,050.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 452.74 (0.75%) పాయింట్లు లాభపడి 60,737.05 పాయింట్ల వద్ద, నిఫ్టీ 169.80 (0.94%) పాయింట్లు క్షీణించి 18,161.75 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 52 వారాల గరిష్టం 60,836.63 పాయింట్లు, 52 వారాల కనిష్టం 39,241.87 పాయింట్లు. నిఫ్టీ 52 వారాల గరిష్టం 18,197.80, 52 వారాల కనిష్టం 11,535.45.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో Tata Motors 20.45 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 5.08 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 3.92 శాతం, ఐటీసీ 3.27 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.13 శాతం లాభపడ్డాయి.

నేటి లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 2.75 శాతం, ONGC 2.17 శాతం, కోల్ ఇండియా 1.68 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 1.56 శాతం, HUL 1.10 శాతం నష్టపోయాయి.

అందుకే లాభాల్లో..

అందుకే లాభాల్లో..

అంతర్జాతీయ మార్కెట్ నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా సానుకూలతలు లాభాలకు కారణమయ్యాయి. పారిశ్రామికోత్పత్తి ఆశాజనకంగా ఉండటం, రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్ఠానికి చేరడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఇక, కరెంట్ సంక్షోభానికి ముగింపు పలకడానికి పీఎంఓ రంగంలోకి దిగింది. కేంద్రం చర్యలు సానుకూలంగా ఉండటం మార్కెట్‌కు బలాన్నిచ్చింది. దేశీయంగా నడిచే విమానాల్లో పూర్తిస్థాయి సీటింగ్‌కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. దీంతో విమానయాన రంగ షేర్లు దూకుడు కనబరిచాయి.

English summary

టాటా మోటార్స్ ఎఫెక్ట్, భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sensex gains 452 points, Nifty closes over 18,150

Auto index added 3.5 percent, while energy, infra, IT, metal, power and capital goods indices up 1 percent each. The BSE midcap and smallcap indices added 0.6-1.5 percent.
Story first published: Wednesday, October 13, 2021, 18:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X