దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఆర్బీఐ రేపోరేటు యథాతథంగా ఉంచడంతో కొనుగోళ్లదారుల్లో జోష్ నింపింది. ఉదయం లాభాలతో ప్రారంభమై తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచిలు.. ఆర్బీఐ ప్రకటనతో తిరిగి భారీ లాభాలతో ముగిశాయి. గత మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. నిప్టీ 144.80 పాయింట్ల లాభంతో 17,784.35 వద్ద ముగియగా, సెన్సెక్స్ 412.23 పాయింట్ల లాభంతో 59,447.18 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో డిఫెన్స్ స్టాక్స్ దూసుకెళ్లాయి.
దేశీయంగా తయారవుతున్న రక్షణ ఉత్పత్తుల ప్రొత్సహించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్థానిక పరిశ్రమల నుంచి డిఫెన్స్ అవరసమైన ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో రక్షణ రంగానికి చెందిన కంపెనీల షేర్లు ఎగబాకాయి. భారత్ డైనమిక్స్ షేరు 15.35 శాతానికి పెరిగి 716.15 వద్ద ముగిసింది. ఒక దశలో 739.45కి ఎగబాకి 52 వారాల గరిష్టానికి చేరి తర్వాత కొంత దిగివచ్చింది. మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ 9 శాతం పెరిగి 201.75 వద్ద ముగిసింది. అటు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ 3.34 శాతం మేర పెరిగి 251.90 వరకు ట్రేడ్ అయింది. ఆస్ట్రా మెక్రోవేవ్ 3.76శాతం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ 3 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 2.24 శాతం, కొచ్చిన్ షిప్ యార్డ్ 2 శాతం, భారత్ ఫోర్ట్ శాతం పెరిగాయి.

అటు ఇంట్రాడేలో ఐటీసీ 4 శాతం లాభపడి 52 వారాల గరిష్టానికి తాకింది. ఎప్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్, అల్ట్రా టెక్ సిమెంట్, టాటా స్టీల్ షేర్లు లాభాలతో ముగిశాయి. మారుతీ, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌సీఎల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 75.93 వద్ద ట్రేడవుతోంది.
ఆర్బీఐ రేపోరేటు యథాతథంగా ఉంచడంతో మదుపర్లలో జోష్ నింపగా.. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోలుపై కేంద్రం ప్రకటన మరింత కలిసివచ్చింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిఫెన్స్ చెందిన 101 పరికాలతో కూడిన స్వదేశీ జాబితాను విడుదల చేశారు. ఇవి దేశీయ పరిశ్రమల నుంచి రూపొందించబడినవి. ఈజాబితాలో నౌక దళ యుటిలిటి హెలికాప్టర్లు, లైట్ ట్యాంకులు, చిన్న మానవరహిత వైమానిక వాహనాలు, యాంటీ షిప్ క్షిపణులు ఉన్నాయి. సెన్సార్లు, ఆయుధాలు, ముందుగుండు సామాగ్రి, రాకెట్లు, పెలింగ్ నౌకలు, యాంటీ షిప్ క్షిపణులు, యాంటీ రేడియేషన్ క్షిపణులు ఉన్నాయి. ఇవి మన దేశ సాయుధ దళాల అవసరాలను తీరుస్తాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అటు 2022-23 బడ్జెట్ లో రక్షణ రంగానికి ఊతం ఇచ్చేలా కేంద్రం కేటాయింపు చేసింది . తాజాగా కేంద్రం నిర్ణయంతో రక్షణ రంగ షేర్లు దూసుకెళ్లాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications