స్టాక్ మార్కెట్లు రెండో రోజుల పాటు నష్టపోయి, నేడు (జూన్ 2, గురువారం) మధ్యాహ్నం గం.11.30 సమయం వరకు ఊగిసలాటలో కనిపించి, ఆ తర్వాత నుండి పైకెగిశాయి. అంతకంతకూ పెరిగి చివరకు 435 పాయింట్ల లాభాల్లో ముగిసింది సెన్సెక్స్. తద్వారా 56,000కు సమీపంలో ముగిసింది. నిఫ్టీ కీలకమైన 16,600 పాయింట్ల పైకి చేరుకుంది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గురువారం నాటి ట్రేడింగ్‌లో స్తబ్దుగా ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం తర్వాత రాణించాయి. రిలయన్స్, టీసీఎస్ అదరగొట్టాయి.
సెన్సెక్స్ ఉదయం 55,382 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,891 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,135 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,481 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,646 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,443 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ రెండు శాతం మేర లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు ఉండగా ఇవి 2 శాతం నుండి 4 శాతం వరకు, టాప్ లూజర్స్ జాబితాలో అపోలో హాస్పిటల్స్, హీరో మోటో కార్ప్, ఐచర్ మోటార్స్, HDFC, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2 శాతం నుండి 5 శాతం మేర నష్టపోయాయి.


Click it and Unblock the Notifications