53,000 పాయింట్ల సమీపంలో ముగిసిన సెన్సెక్స్, భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగంతో గతవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేడు ఎట్టకేలకు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల నుండి నేడు సూచీలకు మద్దతు లభించింది. అలాగే, ఐరోపా మార్కెట్ల నుండి సానికూల సంకేతాలు వచ్చాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను కిందకు పడిపోలేదు. సెన్సెక్స్ 53,000 పాయింట్లకు 50 పాయింట్ల దూరంలో ముగిసింది.

సెన్సెక్స్ ఉదయం 52,901.28 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,986.77 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,804.08 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 363.79 (0.69%) పాయింట్లు ఎగిసి 52,950.63 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,874.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,892.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,834.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 122.10 (0.77%) పాయింట్లు ఎగిసి 15,885.15 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

Sensex gains 363 points led by RIL, IT stocks: Zomato jumps 4 percent

బీఎస్ఈ 30 సూచీలో టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్, టీసీఎస్, మారుతీ సుజీకు, ఇన్ఫోసిస్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, HDFC, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ షార్మా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి షేర్లు భారీగా లాభపడ్డాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్, టైటాన్ కంపెనీ, ఐచర్ మోటార్స్, బీపీసీఎల్, గ్రాసీమ్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జుబితాలో యూపీఎల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో సన్ ఫార్మా, టాటా స్టీల్, HDFC, రిలయన్స్, HDFC బ్యాంకు ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+