ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (నవంబర్ 17) అదరగొట్టాయి. సెన్సెక్స్ 44,000 మార్కును క్రాస్ చేసింది. చివరకు ఆ రికార్డు గరిష్టానికి కాస్త దిగువన ముగిసింది. నిఫ్టీ 12,950 మార్కును దాటి, 13,000కు చేరువైంది. చివరకు 12,850 ఎగువన క్లోజ్ అయింది. భారత్‌లో కరోనా కేసులు తగ్గడం, రికవరీలు భారీగా పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. వీటితో పాటు మోడర్నా టీకా 94 శాతానికి పైగా ఫలితాలు ఇస్తుందని ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు జంప్ చేశాయి.
ఈ ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కనిపించింది. తొలుత ఫైజర్ తమ కరోనా వ్యాక్సీన్‌తో 90 శాతం ఫలితాలు కనిపించాయని ప్రకటించింది. ఆ తర్వాత కూడా కొన్ని ఫార్మా కంపెనీలు ప్రకటించాయి. తాజాగా మోడర్నా తమ వ్యాక్సీన్ వల్ల 94 శాతం ఫలితం కనిపించిందని తెలిపింది. దీంతో ఈక్విటీలు పుంజుకున్నాయి.

సెన్సెక్స్ 314 పాయింట్లు జంప్
నేడు సెన్సెక్స్ 314.73 పాయింట్లు(0.72%) లాభపడి 43,952.71 వద్ద, నిఫ్టీ 93.90 పాయింట్లు(0.73%) లాభపడి 12,874.20 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1443 స్టాక్స్ లాభాల్లో, 1181 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 146 స్టాక్స్‌లో మాత్రం ఎలాంటి మార్పులేదు.
IIFL ఫైనాన్స్ షేర్ ధర ఏకంగా 20 శాతం లాభపడి రూ.112..55 వద్ద క్లోజ్ అయింది. టాటా స్టీల్ స్టాక్ దాదాపు 6 శాతం లాభపడి రూ.521.60 వద్ద, టాటా మోటార్స్ షేర్ 6.15 శాతం ఎగిసి రూ.158 వద్ద ముగిసింది.
దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. కేవలం ఎనర్జీ, ఫార్మా, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6 శాతం, టాటా మోటార్స్ 6.15 శాతం, HDFC లైఫ్ 5.34 శాతం, SBI 4.59 శాతం, అదానీ పోర్ట్స్ 3.70 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో BPCL 4.41 శాతం, హీరో మోటో కార్ప్ 2.71 శాతం,
NTPC 2.42 శాతం, IOC 1.96 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.87 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా..
సూచీలు నేడు సరికొత్త రికార్డును తాకాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 523 పాయింట్లు ఎగిసి 44,161 పాయింట్లను, నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 12,934 వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీ 0.3 శాతం ఎగిసింది. నిఫ్టీ మెటల్ 2 శాతానికి పైగా లాభపడింది.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.97 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.05 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.94 శాతం, నిఫ్టీ మెటల్ 2.49 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.24 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.91 శాతం, నిఫ్టీ ప్రయివేట బ్యాంకు 1.73 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎనర్జీ 0.59 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.14 శాతం, నిఫ్టీ ఐటీ 0.30 శాతం, నిఫ్టీ మీడియా 1.34 శాతం, నిఫ్టీ ఫార్మా 0.69 శాతం నష్టపోయాయి.

రిలయన్స్, ఐటీ డౌన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర 0.37 శాతం క్షీణించి రూ.1994.80 వద్ద క్లోజ్ అయింది. రిలయన్స్ మరోసారి రూ.2000 దిగువకు వచ్చింది.
ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 0.34 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.72 శాతం, ఇన్ఫోసిస్ 0.72 శాతం, మైండ్ ట్రీ 0.30 శాతం, కోఫోర్జ్ 0.43 శాతం నష్టపోయాయి. కేవలం
టెక్ మహీంద్ర 0.42 శాతం, విప్రో 1.24 శాతం మాత్రమే లాభపడ్డాయి.
ప్రధానంగా కరోనా వ్యాక్సీన్ ప్రయోగాల ఫలితాలు సానుకూలంగా కనిపించడంతో ప్రపంచ మార్కెట్లు పుంజుకున్నాయి.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications