ముంబై: స్టాక్ మార్కెట్లు ఈరోజు(సెప్టెంబర్ 15, మంగళవారం) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.19 సమయానికి సెన్సెక్స్ 157.11 పాయింట్లు లేదా 0.41% ఎగిసి 38,913.74 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32.50 పాయింట్లు లేదా 0.28% లాభపడి 11,472.50 వద్ద ప్రారంభమైంది. నిన్న ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత స్వల్పనష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. మార్కెట్లు నిన్న డే-హైతో 475 పాయింట్లు నష్టపోయింది.
నిన్న 100 పాయింట్ల మేర నష్టాలతో ముగిసిన మార్కెట్, ఈరోజు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. మధ్యాహ్నం గం.11.17 సమయానికి సెన్సెక్స్ 57 పాయింట్లు లాభపడి 38,848 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత కాసేపటికి 200 పాయింట్లు లాభపడి 38,893 వద్ద ట్రేడ్ అయింది. డాలర్ మారకంతో రూపాయి 73.38 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. సోమవారం 73.48 వద్ద క్లోజ్ అయింది.

ఫార్మా షేర్ల దూకుడు
నేడు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఐటీ ఇండెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు అర శాతం మేర లాభపడ్డాయి. ఫార్మా షేర్లు దూకుడు మీద ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా 4 శాతం మేర, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 4 శాతం మేర, బజాజ్ ఫిన్ సర్వ్ 2 శాతం, సన్ ఫార్మా 2 శాతం, ఎన్టీపీసీ 2 శాతం లాభాల్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టెక్ మహీంద్ర, ఐటీసీ, బజాజ్ ఆటో ఉన్నాయి.

బలహీనపడిన రిలయన్స్
నిన్న 1 శాతం పడిపోయిన రిలయన్స్ షేర్ ధర ఈ రోజు ఉదయం దాదాపు 0.4 శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. కార్లైల్ సహా వివిధ కంపెనీలు పెట్టుబడులను హోల్డ్‌లో పెట్టడంతో రిలయన్స్ షేర్ ధర క్షీణించింది. నిన్న భారీగా లాభపడిన టీసీఎస్ షేర్ ఈ రోజు 0.5 శాతం మేర క్షీణించింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్ షేర్ ధరలు కూడా 0.4 శాతం వరకు నష్టపోయాయి. ఇన్పోసిస్ మాత్రమే 0.3 శాతం లాభాల్లో ట్రేడ్ అయింది.

భారీ లాభాల్లో అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్ దాదాపు 2 శాతం, ఎస్ అండ్ పీ 1.30 శాతం, డౌజోన్స్ 1.20 శాతం మేర లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో ఈరోజు ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. చైనా డేటా కూడా సానుకూలంగా ఉంది. 2019 ఆగస్ట్‌తో పోలిస్తే 2020 ఆగస్ట్ నెలలో చైనాలో రిటైల్ సేల్స్ 0.5 శాతం మేర ఎగిశాయి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏడాది ప్రాతిపదికన 5.6 శాతం పెరిగింది. మొదటి ఎనిమిది నెలల్లో ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ 0.3 శాతం తగ్గాయి. దీంతో చైనా మార్కెట్లు, ఆసియా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. షాంఘై కాంపోసిజ్ 0.3 శాతం, షెంజెన్ కాంపోనెంట్ 0.23 శాతం, హాంగ్ షెంగ్ ఇండెక్స్ 0.5 శాతం, సౌత్ కొరియా కోస్పి 0.46 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. జపాన్ నిక్కీ మాత్రం 0.5 శాతం మేర క్షీణించింది. టాపిక్స్ ఇండెక్స్ 0.6 శాతం మేర నష్టపోయింది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..



Click it and Unblock the Notifications