అందుకే మహీంద్రా, టాటా మోటార్స్ దూసుకెళ్లాయి! వొడాఫోన్ ఐడియా 13% అప్
ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో బుధవారం లాభాల్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 72.70 పాయింట్లు లాభపడి 11,543 వద్ద, సెన్సెక్స్ 185.23 పాయింట్లు ఎగిసి 39,086.03 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 1.5 శాతం మేర లాభపడింది. స్మాల్ క్యాప్ 1.7 శాతం లాభాల్లో ముగిసింది. నిఫ్టీ ెటల్, ఐటీ, ఆటో రంగాలు 1 శాతం నుండి 2 శాతం మధ్య ఎగిసిపడ్డాయి. ఉదయం మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. చివరలోను అవే లాభాలతో ముగిశాయి.

ఆటో, ఐటీ షేర్ల దూకుడుతో 39వేల పైకి
టాప్ గెయినర్స్ జాబితాలో జీఎంటర్టైన్మెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్ హీరో మోటో కార్ప్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి. మెటల్, ఆటో, ఐటీ, మెటల్ రంగాల షేర్లు లాభాల్లో ముగియడంతో సెన్సెక్స్ 39వేల పైకి చేరుకుంది. ఈ రోజు కనిష్టంతో సెన్సెక్స్ 350 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు లాభపడింది.

అందుకే ఇవి లాభపడ్డాయి
మిడ్ క్యాప్ 1.5 శాతం మేర లాభపడింది. నిఫ్టీ బ్యాంకు 63 పాయింట్ల లాభంతో ముగిసింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మినహా దాదాపు అన్ని లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంకులు 0.2 శాతం మేర నీరసించాయి. మీడియా, మెటల్ కూడా మంచి లాభాల్లో ముగిశాయి. ఆగస్ట్ నెలలో వాహనాల సేల్స్ పుంజుకున్నట్లు వార్తలు రావడంతో మహీంద్రా అండ్ మహీంద్రా 6 శాతం, టాటా మోటార్స్ 5.35 శాతం లాభపడింది. జీప్లెక్స్ లాంచ్ ప్రకటన నేపథ్యంలో జీఎంటర్టైన్మెంట్ 7.53 శాతం లాభపడింది.

వొడాఫోన్ ఐడియా జూమ్
వొడాఫోన్ ఐడియా షేర్ 13 శాతం మేర లాభపడింది. ఇక, డాలర్ మారకంతో రూపాయి 73.02 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 73.10 వద్ద ప్రారంభమైంది. నిన్నటి 72.87తో పోలిస్తే 16 పైసలు నష్టపోయి 73.03 వద్ద క్లోజ్ అయింది. 72.90 నుండి 73.13 మధ్య ట్రేడ్ అయింది. మరోవైపు, నగదు విభాగంలో మంగళవారం FPIలు రూ.486 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్ DIIలు రూ.775 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం FPIలు రూ.3,395 కోట్లకు పైగా అమ్మకాలు చేపట్టగా, DIIలు రూ.681 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.


Click it and Unblock the Notifications