సెన్సెక్స్ 166 పాయింట్లు జంప్, 52,500 పాయింట్ల దిగువనే క్లోజ్
స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. దీంతో వరుస నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం గం.2 వరకు ఊగిసలాటలో కనిపించాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. చివరి గంటన్నరలో సూచీలు అంతకంతకూ పైకి ఎగిసి చివరకు 166 పాయింట్ల లాభాల్లో ముగిసింది. నిఫ్టీ 42 పాయింట్ల లాభాల్లో క్లోజ్ అయింది. ఇంధన, రియాల్టీ, టెలికాం, బ్యాంకింగ్ రంగాల నుండి మద్దతు లభించడంతో చివరలో పుంజుకున్నాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.77 వద్ద నిలిచింది.

భారీ నష్టాల నుండి లాభాల్లోకి..
స్టాక్ మార్కెట్లు ఈ వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాల్లో ముగిశాయి. నేడు కూడా నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, చివరి గంటలో లాభాల్లోకి వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ఇండెక్స్ హెవీవెయిట్స్ భారీగా లాభాల్లోకి వచ్చాయి.
ఇండియా VIX 6 శాతం క్షీణించింది. సెన్సెక్స్ ఉదయం 52,434.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,527.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,177.68 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 166.07 (0.32%) పాయింట్లు ఎగిసి 52,484.67 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 42.20 (0.27%) పాయింట్లు ఎగిసి 15,722.20 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,705.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,738.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,635.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గ్లాండ్ 2.83 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.89 శాతం, ICICI బ్యాంకు 1.49 శాతం, రిలయన్స్ 1.48 శాతం, కోల్ ఇండియా 1.37 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 2.37 శాతం, బ్రిటానియా 1.40 శాతం, JSW స్టీల్ 1.36 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.23 శాతం, హిండాల్కో 0.88 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, అదానీ పోర్ట్స్, HDFC బ్యాంకు, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.27 శాతం లాభాల్లో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.01 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 1.29 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.36 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.38 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.05 శాతం, నిఫ్టీ ఐటీ 0.02 శాతం, నిఫ్టీ మీడియా 0.58 శాతం, నిఫ్టీ ఫార్మా 0.60 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.53 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.23 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎనర్జీ 0.12 శాతం, నిఫ్టీ మెటల్ 1.49 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.01 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications