ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 14) లాభాల్లో ముగిశాయి. సూచీలు వరుసగా రెండో రోజు లాభపడటంతో నిఫ్టీ 13,550 పాయింట్లకు పైగా ముగిసింది. సెన్సెక్స్ 154.45 పాయింట్లు(0.34%) లాభపడి 46,253.46 వద్ద, నిఫ్టీ 44.30 పాయింట్లు(0.33%) ఎగిసి 13,558.20 పాయింట్ల వద్ద ముగిసింది. 1769 షేర్లు లాభాల్లో, 1009 షేర్లు నష్టాల్లో ముగియగా 131 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఆటో, రియాల్టీ రంగాలు మినహా దాదాపు మిగతా రంగాలు లాభాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు 0.8 శాతం లాభపడ్డాయి.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
నేటి మోస్ట్ గెయినర్స్ జాబితాలో ONGC 4.86 శాతం, లార్సన్ 4.63 శాతం, సిప్లా 4.43 శాతం, కోల్ ఇండియా 3.69 శాతం, ఐవోసీ 2.50 శాతం లాభాల్లో ముగిశాయి.
మోస్ట్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 2.85 శాతం, హీరో మోటో కార్ప్ 2.25 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.18 శాతం, HDFC లైఫ్ 1.32 శాతం, విప్రో 1.17 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంకు, లార్సన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.
అత్యంత వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 0.61 శాతం తగ్గి రూ.1,993.50 వద్ద క్లోజ్ అయింది. ఈ స్టాక్ చాలా రోజుల తర్వాత గతవారం రూ.2000కు పైన క్లోజ్ అయింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయి కిందకు వచ్చింది.

రంగాలవారీగా చూస్తే..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.33 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.82 శాతం ఎగిశాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.04 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.89 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ బ్యాంకు 0.46 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.86 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.14 శాతం, నిఫ్టీ ఐటీ 0.36 శాతం, నిఫ్టీ మీడియా 2.00 శాతం, నిఫ్టీ మెటల్ 1.38 శాతం, నిఫ్టీ ఫార్మా 0.76 శాతం, నిఫ్టీ పీఎశ్‌యూ బ్యాంకు 1.77 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.47 శాతం లాభపడ్డాయి.

బర్గర్ కింగ్స్ జంప్
బర్గర్ కింగ్ స్టాక్ 131 శాతం లాభపడింది. ప్రారంభంలోనే 94 శాతం లాభపడిన ఈ స్టాక్స్ చివరకి 130 శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ స్టాక్ ఇష్యూ ధర రూ.60 కాగా, రూ.138.40 వద్ద ముగిసింది.
అమెరికా సహా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంట్ బలపడి, మదుపరులు కొనుగోళ్లకు ఉత్సాహం చూపుతున్నారు. దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా రావడంతో సూచీలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications