Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈరోజు బుల్స్ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధానంగా ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు, టెక్ కంపెనీల షేర్లు నేడు ప్రధానంగా లాభాల బాటలో కొనసాగాయి.
సెన్సెక్స్, నిఫ్టీ 50 ప్రారంభ లాభాలను పొడిగించాయి. సూచీలు మధ్యాహ్నం సమయానికి ఒక శాతం ఎక్కువ లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఆర్థిక సేవలు, ఐటి రంగాల్లో కొనుగోళ్ల కోలాహలం లాభాలకు దారితీసింది. నేటితో నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగియడంతో కొంత అస్థిరత ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు రానున్న సుదీర్ఘ వారం కోసం జాగ్రత్తగా ట్రేడింగ్ ఎంపికలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇంట్రాడేలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 0.5 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 0.7 శాతం లాభపడ్డాయి. ట్రేడింగ్ సెకండ్ సెషన్లో సెన్సెక్స్ సూచీ 900 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ సూచీ 3 గంటల సమయంలో దాదాపు 1000 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 332 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 487 పాయింట్ల భారీ లాభంతో ముందుకు సాగుతున్నాయి. అలాగే నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిఫ్టీ హెల్త్‌కేర్ కూడా ఒక్కొక్కటి 1 శాతానికి పైగా నేడు ర్యాలీ అయ్యాయి.
ఇదే క్రమంలో నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్, ఐషర్ మోటార్స్ స్టాక్స్ లాభపడగా.. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా, HCLTech కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే.. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడగా.. HCLTech, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాలతో ముందుకు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications