Markets Crash: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. దీంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్ల సంపద నష్టాన్ని చవిచూశారు. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు తమ ప్రయాణాన్ని భారీ నష్టాల్లో ముగించాయి. ముగింపు సమయంలో సెన్సెక్స్ సూచీ 1769 పాయింట్లు, నిఫ్టీ సూచీ 547 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 1077 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1334 పాయింట్ల పతనాన్ని చూశాయి. ఈ క్రమంలో అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీంతో గడచిన రెండు
కొన్ని వారాలుగా స్వల్ప కరెక్షన్లతో కొనసాగిన బుల్ జోరు అంతర్జాతీయ కారణాల మధ్య పెద్ద పతనాన్ని చూస్తోంది. ఈ క్రమంలో నేడు బెంచ్ మార్క్ సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకుని పెట్టుబడిదారులకు కన్నీరు మిగిల్చాయి. అయితే దీనికి ఉన్న కీలకమైన కారణాలను పరిశీలిస్తే..

- ముందుగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్‌కు సంబంధించి పెద్ద మార్పులను ప్రకటించింది. వీటి ప్రకారం ఇంట్రా-డే పొజిషన్ పరిమితి పర్యవేక్షించబడుతుంది. డెరివేటివ్స్ కనీస ట్రేడింగ్ మొత్తం కూడా భారీగా పెంచబడింది. వీటి విషయంలో తెచ్చిన కొత్త మార్పులు నవంబర్ 20 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలో ఇండెక్స్ ఆప్షన్స్ బయర్స్ నుంచి ముందస్తుగానే ఆప్షన్ ప్రీమియం వసూలు చేయబడుతుంది. ఎంపిక గడువు ముగిసే రోజున షార్ట్ ఆప్షన్ కాంట్రాక్టులకు 2% అదనపు మార్జిన్ ఛార్జ్ చేయబడుతుంది. అలాగే కనీస ట్రేడ్ మెుత్తాన్ని రూ.5 నుంచి రూ.15 లక్షలకు పెంచబడింది.
-మార్కెట్ల మెగా పతనానికి దారితీసిన అతిపెద్ద కారణం మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణం గ్లోబల్ మార్కెట్లను భయాల్లోకి నెట్టింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధంలో ఇరాన్ ప్రవేశం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతను మరింత వేడెక్కించటంతో మార్కెట్లు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్ అక్టోబర్ 1 రాత్రి ఇజ్రాయెల్‌పై బలమైన ఎదురుదాడిని ప్రారంభించగా దాదాపు 150కి పైగా క్షిపణులను ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించి ఉక్కిరిబిక్కిరి చేసింది.
- యుద్ధం విషయంలో అమెరికా ఇన్వాల్వ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత రెండు రోజులుగా అమెరికా స్టాక్ మార్కెట్‌లో మిశ్రమ ట్రేడింగ్ జరుగుతోంది. రెండు రోజుల్లో డౌ సూచీ దాదాపు 135 పాయింట్లు క్షీణించగా నిన్న ఫ్లాట్ ముగింపును యూఎస్ మార్కెట్లు చూశాయి. అయితే మరోపక్క జపాన్, చైనా మార్కెట్లు మాత్రం తుఫాను పెరుగుదలను చూస్తున్నాయి. అలాగే హాంకాంగ్ మార్కెట్‌లో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. వారం కిందటి వరకు వరుసగా క్షీణించిన చమురు ధరలు యుద్ధ భయాల మధ్య తరిగి అకస్మాత్తుగా పుంజుకున్నాయి. అయితే పరిస్థితులు అదుపుతప్పున్న తరుణంలో నాలుగు రోజులుగా పెరుగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 75 డాలర్లకు చేరుకున్నాయి.బేస్ మెటల్స్ విషయానికి వస్తే రాగి, అల్యూమినియం 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇదే క్రమంలో జింక్ 2 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. అయితే ఈ క్రమంలో ఇరాన్ లోని ఆయిల్ స్థావరాలపై ఏదైనా దాడి జరిగితే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది భారత్ వంటి చమురు దిగుమతిదారులకు మరింత భారంగా మార్చుతుందన్నారు.
- విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రారంభం నుంచి భారత స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీనికి సుదీర్ఘంగా సారిన బుల్ ర్యాలీ వల్ల మార్కెట్లు ఓవర్ బాట్ స్థాయికి చేరటం ఒక కారణంమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఎఫ్ఐఐలు రూ.5579 కోట్ల విలువైన పెట్టుబడులను క్యాష్ మార్కెట్‌లో విక్రయించారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications