బడ్జెట్ దూకుడుకు ప్రాఫిట్ బుకింగ్ బ్రేక్: భారీ నష్టాల్లో మార్కెట్లు,సెన్సెక్స్ 300పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. సెన్సెక్స్ నిన్న 51,329 వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో 200 పాయింట్లు దాకా లాభపడినప్పటికీ, కాసేపట్లోనే నేష్టాల్లోకి వెళ్లింది. ఉదయం స్వల్ప సమయం మినహా ఆ తర్వాత నష్టాల్లోనే ఊగిసలాడుతోంది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
నాటి నుండి మార్కెట్లు వరుసగా లాభాల్లో దూసుకెళ్తూ, సరికొత్త శిఖరాలను తాకాయి. అయితే నిన్న మాత్రం దాదాపు స్థిరంగా లేదా స్వల్ప నష్టాల్లో ముగిశాయి. నేడు కూడా ఆ నష్టాలు కొనసాగాయి. బడ్జెట్ అనంతరం మార్కెట్లు వరుసగా ఆరు రోజులు భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. దీంతో నష్టాల్లోకి వెళ్లాయి.

భారీ నష్టాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ ఉదయం 51,355 వద్ద ప్రారంభమై, 51,512 వద్ద గరిష్టాన్ని, 50,846 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.9.16 సమయానికి 108 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మధ్యాహ్నం గం.2.00 సమయానికి 270 పాయింట్లు నష్టపోయి 51,057 పాయింట్ల వద్ద ఉంది. సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 470 పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది.
డాలర్ మారకంతో నేడు రూపాయి మరింతగా బలపడింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఉదయం 72.87 వద్ద ప్రారంభమైంది. నిన్న 72.88 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేడు టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్‌సర్వ్ 3.10 శాతం, SBI లైఫ్ ఇన్సురా 2.18 శాతం, HDFC లైఫ్ 1.83 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.71 శాతం, గ్రాసీమ్ 1.32 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు 1.90 శాతం, అదానీ పోర్ట్స్ 1.62 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.65 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.62 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.55 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.44 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.25 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.44 శాతం, నిఫ్టీ ఐటీ 0.15 శాతం, నిఫ్టీ మీడియా 1.90 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.30 శాతం, లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 1.21 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.41 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.56 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.30 శాతం, నిఫ్టీ మెటల్ 0.11 శాతం, నిఫ్టీ ఫార్మా 0.11 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.18 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.08 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications