భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 586 పాయింట్లు పతనం
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (జూలై 19) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత అంతకంతకూ దిగజారాయి. సూచీలు ఏ దశలోను కోలుకోలేదు. సెన్సెక్స్ చివరకు 586 పాయింట్లు, నిఫ్టీ 171 పాయింట్ల నష్టంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో ఫైనాన్స్, బ్యాంకింగ్, మెటల్, టెలికం రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడం సూచీలపై ప్రభావం చూపింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కో శాతం చొప్పున క్షీణించాయి.
దీంతో ఆర్థిక రికవరీపై ఇన్వెస్టర్లలో అనుమానాలు మొలకెత్తాయి. డాలర్ మారకంతో రూపాయి విలువ రూ.74.87 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 52,606.99 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,821.17 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,405.89 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,754.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,836.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,707.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 586.66 (1.10%) పాయింట్లు దిగజారి 52,553.40 పాయింట్ల వద్ద, నిఫ్టీ 171.00 (1.07%) పాయింట్లు దిగజారి 15,752.40 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో NTPC, BPCL, దివిస్ ల్యాబ్స్, నెస్ట్లే, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు, HDFC లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, HDFC, హిండాల్కో ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC బ్యాంకు, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications