ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం(మార్చి 25) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పీఎస్‌యూ బ్యాంకు సూచీ మూడు శాతానికి పైగా క్షీణించగా, ఆటో, ఎనర్జీ, ఐటీ సూచీలు 1 శాతం నుండి 2 శాతం మేర పడిపోయాయి. లక్ష్మీ ఆర్గానిక్ 20 శాతం ప్రీమియంతో ప్రారంభమైంది. కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. దీంతో మార్కెట్లు పతనమవుతున్నాయి.
ఈక్విటీ మార్కెట్‌లలో అమ్మకలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రంలో దాదాపు ఐదు నెలల తర్వాత రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తోంది. అమెరికా డాలర్ మారకంతో రూపాయి ఫ్లాట్‌గా 72.59 వద్ద ట్రేడ్ అయింది. నిన్న 72.56 వద్ద క్లోజ్ అయింది.

49వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు ఉదయం 49,201.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,247.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,625.21 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిన్న ఏకంగా 870 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు ఉదయం సెషన్లో మరో 600 పాయింట్ల మేర క్షీణించింది.
నిఫ్టీ 14,570.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,575.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,359.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 550.72 (1.12%) పాయింట్లు క్షీణించి 48,629 పాయింట్ల వద్ద, నిఫ్టీ 158.85 (1.09%) పాయింట్లు క్షీణించి 14,390 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ రెండు రోజుల్లో 1500 పాయింట్ల వరకు పడిపోయింది. సెన్సెక్స్ ఏకంగా 49వేల పాయింట్ల దిగువకు వచ్చింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ టాటా మోటార్స్, టాటా స్టీల్, రిలయన్స్, SBI, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో లార్సన్ 0.30 శాతం, గ్రాసీమా 0.17 శాతం, టెక్ మహీంద్రా 0.20 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 3.68 శాతం, IOC 2.86 శాతం, టాటా మోటార్స్ 2.56 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.61 శాతం, ఎస్బీఐ 2.38 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.14 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.38 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 2.51 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.17 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.28 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.69 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.71 శాతం, నిఫ్టీ ఐటీ 1.39 శాతం, నిఫ్టీ మీడియా 3.32 శాతం, నిఫ్టీ మెటల్ 2.28 శాతం, నిఫ్టీ ఫార్మా 1.47 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 5.06 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.36 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.25 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications