ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జనవరి 29) భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఆరో రోజు నష్టపోయాయి. గత గురువారం ప్రారంభమైన నష్టాల పరంపర ఈ వారం ముగింపు వరకు కొనసాగింది. ఓ సమయంలో 50,000 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ఇప్పుడు 46,000 స్థాయికి పడిపోయింది. ఈ ఆరు సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 4,000 పాయింట్లు పతనమైంది.
ఉదయం మార్కెట్లు లాభాల్లో కనిపించినప్పటికీ, తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం నుండి ఊగిసలాటలో ఉన్నాయి. ఓ సమయంలో 500 పాయింట్ల వరకు లాభపడ్డప్పటికీ చివరకు అదే స్థాయిలో నష్టాల్లో ముగిశాయి. నేటి సెషన్లో సెన్సెక్స్ 1140 పాయింట్ల మధ్య కదలాడింది.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి

మార్కెట్లు డౌన్, రూపాయి అప్
స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్లో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 589 పాయింట్లు లేదా 1.26 శాతం నష్టపోయి 46,285.77 పాయింట్ల వద్ద, నిఫ్టీ 183 పాయింట్లు లేదా 1.32 శాతం క్షీణించి 13,634.60 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.69 శాతం, 0.25 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 30లో ఐదు స్టాక్స్ మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంకు, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ మాత్రమే లాభపడ్డాయి. డాలర్ మారకంతో ఉదయం 73.03 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన రూపాయి 9 పైసలు లాభపడి 72.96 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు తోడు బడ్జెట్ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించారు.

టాప్ లూజర్స్ గెయినర్స్
సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఆరు సెషన్లలో నష్టపోయి 6శాతం మేర క్షీణించాయి. గత ఎనిమిది నెలల కాలంలో ఈ స్థాయి పతనం మొదటిసారి. మిడ్ క్యాప్ సూచీలు వరుసగా మూడోవారం నష్టాల్లో ముగిశాయి. గత నాలుగు నెలల కాలంలో భారీ పతనం ఇదే. నిఫ్టీ బ్యాంకు వరుసగా రెండో వారం నష్టపోయింది. ఈ వారం 2 శాతం నష్టపోయింది.
- నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు 5.42 శాతం, సన్ ఫార్మా 3.87 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.66 శాతం, HDFC బ్యాంకు 1.39 శాతం, HDFC లైఫ్ 0.92 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 5.52 శాతం, మారుతీ సుజుకీ 5.03 శాతం, హీరో మోటో కార్ప్ 4.16 శాతం, టాటా స్టీల్ 3.64 శాతం, విప్రో 3.24 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. రిలయన్స్ స్టాక్ నేడు మరింత పతనమై రూ.1841 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.32 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.72 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.25 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.83 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.07 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.40 శాతం, నిఫ్టీ ఐటీ 2.59 శాతం, నిఫ్టీ మీడియా 1.11 శాతం, నిఫ్టీ మెటల్ 1.93 శాతం, నిఫ్టీ ఫార్మా 1.82 శాతం నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 0.68 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 1.69 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.49 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.85 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications