ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత మరింత కిందకు పడిపోయాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 39.73 పాయింట్లు లేదా 0.08% నష్టపోయి 49544.43 పాయింట్ల వద్ద, నిఫ్టీ దాదాపు స్థిరంగా 14595.60 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత సెన్సెక్స్ 475 పాయింట్ల మేర పడిపోయి 49,109కు పడిపోయింది. వరుస లాభాల్లో ఉన్న సూచీలు నేడు పడిపోవడం గమనార్హం.

భారీ నష్టాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ నేడు 49,656 వద్ద ప్రారంభమైనప్పటికీ, నేటి గరిష్టం అదే. మధ్యాహ్నం గం.11.30 సమయం వరకు కనిష్టం 49,094 పాయింట్లు. ప్రపంచ మార్కెట్లు బలహీన సంకేతాలు మార్కెట్ల పైన ప్రభావం చూపాయి. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్, రిలయన్స్ లాంటి దిగ్గజ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా సూచీలు సరికొత్త శిఖరాలను తాకడంతో ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపిస్తోంది. దీంతో భారీగా నష్టపోయాయి. రిలయన్స్ 0.094 శాతం, టీసీఎస్ దాదాపు 1 శాతం, HDFC షేర్ 1.83 శాతం, HDFC బ్యాంకు షేర్ 1.46 శాతం నష్టపోయాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్‌టెల్ 2.97 శాతం, UPL 1.64 శాతం, గెయిల్ 0.31 శాతం, బజాజ్ ఆటో 0.14 శాతం, HDFC లైఫ్ 0.10 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో 2.49 శాతం, హీరో మోటో కార్ప్ 2.28 శాతం, బీపీసీఎల్ 2.32 శాతం, HCL టెక్ 1.89 శాతం, శ్రీసిమెంట్స్ 1.79 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, వొడాఫోన్ ఐడియా ఉన్నాయి.

అన్ని రంగాలు పతనం
నిఫ్టీ 50 స్టాక్స్ 0.90 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.52 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.73 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.99 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.02 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.10 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.92 శాతం, నిఫ్టీ ఐటీ 0.89 శాతం, నిఫ్టీ మీడియా 1.03 శాతం, నిఫ్టీ మెటల్ 0.50 శాతం, నిఫ్టీ ఫార్మా 0.91 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.16 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.67 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.89 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications