ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. నిన్న దాదాపు 600 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు మరో 350 పాయింట్లకు పైగా క్షీణించింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు వెయ్యి పాయింట్లు పతనమైంది. 53,000 పాయింట్ల దిశగా కనిపించిన సెన్సెక్స్ నేడు 52,200 పాయింట్ల దిగువకు చేరుకుంది. నిఫ్టీ కూడా నిన్న 170 పాయింట్లు, నేడు 120 పాయింట్లు పతనమైంది. రెండు రోజుల్లో దాదాపు మూడు వందల పాయింట్లు నష్టపోయింది.
ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఇన్వెస్టర్లలో సందేహాలు నెలకొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. రియాల్టీ, మెటల్, విద్యుత్, టెలికం, బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ దశలో 52,013 వద్ద సెన్సెక్స్, 15,578 వద్ద నిఫ్టీ కనిష్టాలను తాకింది.

సెన్సెక్స్ 354.89 (0.68%) పాయింట్లు నష్టపోయి 52,198.51 పాయింట్ల వద్ద, నిఫ్టీ 120.30 (0.76%) పాయింట్లు నష్టపోయి 15,632.10 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్, HUL, గ్రాసీమ్, మారుతీ సుజుకీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications