ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(సెప్టెంబర్ 17) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం 275 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్, ఆ తర్వాత కాస్త నష్టాలు తగ్గినట్లుగానే కనిపించినా, తిరిగి అంతకుమించిన నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 323.00 (0.82%) పాయింట్లు నష్టపోయి 38,979.85 వద్ద, నిఫ్టీ 88.45 (0.76%) పాయింట్లు కోల్పోయి 11,516.10 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.24 శాతం, 0.53 శాతం మేర నష్టపోయింది. బీఎస్ఈ హెల్త్‌కేర్, ఐటీ, టెక్ షేర్లు మినహా మిగతా రంగాలు నష్టాల్లో ముగిశాయి.

ఆ షేర్లు దూకుడు
మోస్ట్ యాక్టివ్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, టాటా మోటార్స్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి. కొన్ని ఐటీ షేర్లు దూకుడును కొనసాగించాయి. ఇన్ఫోసిస్ షేర్ ఈరోజు 0.92 శాతం పెరిగి రూ.1,011, హెచ్‌సీఎల్ టెక్ షేర్ ధర 2.16 శాతం పెరిగి రూ.806 వద్ద ముగిసింది. అయితే టీసీఎస్ షేర్ ధర 1.48 శాతం, విప్రో షేర్ ధర 0.40 శాతం, టెక్ మహీంద్రా 0.57 శాతం మేర క్షీణించాయి.

హ్యాపీయెస్ట్ మైండ్ లిస్టింగ్
ఈ రోజు హ్యాపియెస్ట్ మైండ్ లిస్టింగ్ అయింది. ఇష్యూ చేసిన ధరతో పోలిస్తే ఈ షేర్ ధర 135 శాతం లాభాల్లో ముగిసింది. అయినప్పటికీ సెన్సెక్స్ 39వేల మార్క్ దిగువనే క్లోజ్ అయింది. ప్రధానంగా ఫైనాన్షియల్ రంగంతో పాటు రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్ భారీగా నష్టపోవడానికి కారణమని చెబుతున్నారు. ఆసియా దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు 1.23 శాతం మేర క్షీణించి రూ.2,295 వద్ద ముగిసింది.
నిఫ్టీ బ్యాంకు 253 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 42 పాయింట్లు క్షీణించింది.
నిఫ్టీ హెవీవెయిట్స్‌లో ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడింది. రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నష్టాల్లో ముగిశాయి.
ఆర్థిక పునరుద్ధర ఆందోళనల నేపథ్యంలో మెటల్, స్టీల్ కంపెనీలు నష్టపోయాయి.
కోవిడ్ వ్యాక్సీన్ పైన రష్యాతో ఒప్పందం నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.
టాటా మోటార్స్ 2 శాతం మేర నష్టపోయింది. ఈయూలో జేఎల్ఆర్ కొత్త కారు సేల్స్ సేల్స్ పడిపోయాయి. ఈ ప్రభావం పడింది.
హ్యాపీయెస్ట్ మైండ్ ఇష్యూ ధర రూ.166 కాగా, రూ.371 వద్ద క్లోజ్ అయింది.

అందుకే నష్టాల్లో మార్కెట్లు...
అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ అంచనా కంటే కాస్త వేగంగానే కోలుకుంటుందని చెప్పిన ఫెడ్, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు ఫెడ్ రేట్లు పెంచేది లేదని, 2023 వరకు ఉలాగే ఉండవచ్చునని వెల్లడించాయి. మరో రెండేళ్ల పాటు ఫెడ్ వడ్డీ రేట్లు పెరగవు. ప్రధానంగా ఈ ప్రభావం మార్కెట్లపై పడింది. మరోవైపు, చైనా-భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గలేదని ప్రభుత్వం చెప్పింది. అలాగే, దేశంలో కరోనా కేసులు ఇతర దేశాలతో పోలిస్తే వేగంగా పెరుగుతున్నాయి. ఈ అంశాలు కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications