350 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, చైనా ఎఫెక్ట్, చమురు ధరల క్షీణత
స్టాక్ మార్కెట్లు నేడు (28, మార్చి 2022) భారీ నష్టాల్లో ఉన్నాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం గం.10 సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల నష్టాల్లో ఉంది. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా చమురు ధరలపై ప్రభావం కనిపిస్తోంది. దీంతో క్రూడ్ ధరలు తగ్గుతున్నాయి. భారీగా నష్టపోయిన వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉంది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.

నష్టాల్లో మార్కెట్లు
ఉదయం సెన్సెక్స్ 57,472 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,494 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,494 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,181 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,196.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,058.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
ఉదయం గం.10 సమయానికి సెన్సెక్స్ 328.85 (0.57%) పాయింట్లు నష్టపోయి 57,022.77 పాయింట్ల వద్ద, నిఫ్టీ 87.40 (0.51%) పాయింట్లు క్షీణించి 17,065.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

ఇన్వెస్టర్ల సెంటిమెంట్
వరుసగా మూడు రోజుల పాటు వరుస భారీ నష్టాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గతవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సరిహద్దు ఉద్రిక్తతలు (రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం), సరఫరా ఆందోళనలు వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటును గతవారం దెబ్బతీశాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు అప్పుడు చమురు ధరల పెరుగుదల, చైనాలో కరోనా కేసులు పెరిగి, లాక్ డౌన్‌కు దారి తీయడం వంటి అంశాలు ప్రభావం చూపాయి. ఆసియాలో భారత్‌తో పాటు జపాన్, హాంగ్ కాంగ్, సౌత్ కొరియా, షాంఘై స్టాక్స్ నష్టాల్లో ఉండగా, ఆస్ట్రేలియా స్టాక్స్ నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా కరోనా కారణంగా షాంఘై క్లోజ్ డౌన్ ప్రభావం చూపింది. సరఫరా వ్యవస్థ నెమ్మదించే అవకాశాలున్నాయి. దీంతో ఆసియా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. తమ దేశం తటస్థంగా ఉండాలన్న రష్యా డిమాండ్ పైన ఆలోచిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇది ఉద్రిక్తతల తగ్గుముఖానికి దోహదం చేసే అవకాశముందని అంటున్నారు.

చమురు ధరలు డౌన్
ఇది చమురు ధరలపై కూడా ప్రభావం చూపింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా విక్రయించబడే బ్రెంట్ క్రూడ్ నేడు దాదాపు 3 శాతం క్షీణించి 114 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ కూడా దాదాపు అదే స్థాయిలో క్షీణించి 110 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications