ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(అక్టోబర్ 22) నష్టాల్లో ముగిశాయి. వరుసగా 10 రోజులు లాభాలు నమోదు చేసిన మార్కెట్ గత గురువారం భారీగా నష్టపోగా, మళ్లీ ఈ గురువారం నష్టపోయింది. గురువారం తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు లాభాలు చూశాయి. నేడు మళ్లీ సెన్సెక్స్ 149 పాయింట్లు(0.37%) నష్టపోయి 40,558.49 వద్ద, నిఫ్టీ 41.20 పాయింట్లు(0.35%) క్షీణించి 11,896.50 పాయింట్లవద్ద ముగిసింది. 1,412 షేర్లు లాభాల్లో, 1,188 షేర్లు నష్టాల్లో ముగియగా, 159 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు మార్కెట్‌ను దెబ్బకొట్టాయి.

కిందకు లాగిన ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా
సెన్సెక్స్ 148 పాయింట్ల నష్టంతో ముగియగా, నిఫ్టీ 11,900 దిగువకు చేరింది.
ప్రధానంగా ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు మార్కెట్‌ను కిందకు లాగాయి.
నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 1.1 శాతం మేర లాభపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 0.6 శాతం మేర లాభపడింది.
నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ భారీగా నష్టపోయాయి.
నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ రియాల్టీ లాభాల్లో ముగిశాయి.
హీరో మోటో కార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ భారీగా నష్టపోయాయి. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఐవోసీఎల్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ముగిశాయి.

టాప్ గెయినర్స్.. టాప్ లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఐవోసీ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, సిప్లా ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 0.60 శాతం క్షీణించి రూ.2,112 వద్ద క్లోజ్ అయింది.
ఏషియన్ పేయింట్స్ రెండో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర లాభం 1.2 శాతం, రెవెన్యూ 5.9 శాతం పెరిగింది. ఫలితాల నేపథ్యంలో ఈ స్టాక్ ఒత్తిడిలో కనిపించింది. స్టాక్ 0.88 శాతం క్షీణించి రూ.2,095 వద్ద ముగిసింది.

దెబ్బకొట్టిన ఐటి, బ్యాంకు
ఫలితాల అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్టాక్స్ నిన్నటి వరకు మంచి లాభాలు చూశాయి. అయితే ఈరోజు 0.13 శాతం క్షీణించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ 1.18 శాతం పడిపోయింది.
ఐసీఐసీఐ షేర్ 1.62 శాతం, ఎస్బీఐ షేర్ 0.074 శాతం, కొటక్ మహీంద్ర బ్యాంకు 0.13 శాతం నష్టపోయాయి.
ఐటీ స్టాక్స్ కూడా భారీ లాభాలు నమోదు చేశాయి.
టీసీఎస్ 0.093 శాతం క్షీణించి రూ.2,673, హెచ్‌సీఎల్ టెక్ 0.58 శాతం పడిపోయి రూ.866, ఇన్ఫోసిస్ షేర్ 1.13 శాతం పడిపోయి రూ.1,135 వద్ద, టెక్ మహీంద్ర 0.80 శాతం పడిపోయి రూ.839 వద్ద, కోఫోర్జ్ 1.27 శాతం పడిపోయి రూ.2,480 వద్ద క్లోజ్ అయింది.
అయితే విప్రో 0.16 శాతం ఎగిసి రూ.344 వద్ద, మైండ్ ట్రీ 1.84 శాతం లాభపడి రూ.1,379 వద్ద ముగిశాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications