స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి వెళ్లాయి. ఈ వారం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, నిన్న లాభాల్లోకి వచ్చాయి. అయితే అంతలోనే నేడు తిరిగి నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం నుండి సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఏ దశలోను కోలుకోలేదు. సాయంత్రం సెషన్లో కాస్త పుంజుకున్నట్లుగా కనిపించినప్పటికీ భారీ నష్టాల నుండి కాస్త తగ్గాయి అంతే.
సెన్సెక్స్ ఉదయం 52,673.69 ప్రారంభమైన మార్కెట్లు, 52,673.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,802.73 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,761.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,767.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,513.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 135.05 (0.26%) పాయింట్లు నష్టపోయి, 52,443.71 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.05 (0.24%) పాయింట్లు నష్టపోయి 15,709.40 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, దివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా, సిప్లా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.


Click it and Unblock the Notifications