రెండో రోజు మార్కెట్ జంప్, సెన్సెక్స్ 1200 పాయింట్లు అప్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల నేపథ్యంలో స్టాక్స్ దుమ్మురేపుతున్నాయి. నిన్న 2300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ నేడు 1200 పాయింట్లకు పైగా లాభపడింది. సెన్సెక్స్ నేడు 49,800 పాయింట్ల వరకు చేరుకోగా, నిఫ్టీ 14,600 పాయింట్లకు పైగా దాటింది. బడ్జెట్ ఉత్సాహంతో ఆల్ టైం గరిష్టాన్ని తాకాయి. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు సూచీ 34000 మార్కును దాటింది.

సెన్సెక్స్ జంప్
సెన్సెక్స్ 1,197.11 పాయింట్లు లేదా 2.46% లాభపడి 49,797.72 పాయింట్ల వద్ద, నిఫ్టీ 366.70 పాయింట్లు లేదా 2.57% ఎగిసి 14,647.90 పాయింట్ల వద్ద ముగిసింది. 1727 షేర్లు లాభాల్లో, 1165 షేర్లు నష్టాల్లో ముగియగా, 170 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్, ఆటో, ఇన్ఫ్రారంగాలు దాదాపు 3 నుండి 4 శాతం మేర క్షీణించాయి. డాలర్ మారకంతో రూపాయి నేడు 6 పైసలు లాభపడి 72.96 వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్లో 73.02 వద్ద క్లోజ్ అయింది. నేటి సెషన్లో 72.92-73.05 మధ్య ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
నేటి సెషన్లో టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 15.16 శాతం, శ్రీసిమెంట్స్ 7.70 శాతం, SBI 7.21 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 6.60 శాతం, యూపీఎల్ 6.03 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 2.57 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.53 శాతం, హీరో మోటో కార్ప్ 1.40 శాతం, టైటాన్ కంపెనీ 1.07 శాతం, SBI లైఫ్ ఇన్సురా 1.05 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 2.57 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 3.01 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 4.01 శాతం, నిఫ్టీ బ్యాంకు 3.56 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.19 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.23 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.12 శాతం, నిఫ్టీ ఐటీ 2.11 శాతం, నిఫ్టీ మీడియా 3.28 శాతం, నిఫ్టీ మెటల్ 1.92 శాతం, నిఫ్టీ ఫార్మా 2.13 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.47 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.79 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.04 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications