ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 13) స్వల్ప లాభాల్లో ముగిశాయి. నేడు ఆద్యంతం మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సంవత్ 2076లో లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 43,443.00 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు ఎగిసి 12,720 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు లాభాల స్వీకరణ నేపథ్యంలో ఉదయం నష్టపోయిన మార్కెట్లు, ఆ తర్వాత తేరుకున్నాయి. తొలుత ఒత్తిడిలో ఉన్న బ్యాంకింగ్ షేర్లు ఆ తర్వాత పుంజుకోవడం కలిసి వచ్చింది.

పడి'లేచిన' మార్కెట్లు
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వివిధ దేశాలు లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ సాంకేతికంగా సంక్షోభంలోకి వెళ్లిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రభావం మార్కెట్లపై పడింది. మరోవైపు ఈ వారం ప్రారంభంలో రికార్డ్ స్థాయికి సూచీలు వెళ్లిన నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఈ కారణంగా కూడా మార్కెట్లు ఉదయం నష్టపోయాయి. ఓ సమయంలో 250 పాయింట్ల వరకు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 86 పాయింట్ల లాభంతో ముగిసింది. నేడు 43,508ని కూడా దాటింది.

రిలయన్స్ @2,000
టాప్ గెయినర్స్ జాబితాలో... ఐచర్ మోటార్స్ 6.97 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.34 శాతం, కోల్ ఇండియా 3.11 శాతం, టాటా స్టీల్ 2.83 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.96 శాతం లాభాల్లో ముగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో... టాటా మోటార్స్ 3.21 శాతం, లార్సన్ 2.02 శాతం, HDFC 1.09 శాతం, యూపీఎల్ 0.99 శాతం, HDFC బ్యాంకు 0.94 శాతం నష్టాల్లో ముగిశాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 2000 వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో రూ.2,035ను తాకిన షేర్ ధర ఈ రోజు చివరకు 1 శాతం లాభంతో ముగిసింది.

9 సెషన్లలో లాభం
వరుసగా 8 రోజుల లాభాలకు నిన్న బ్రేక్ పడింది. మళ్లీ ఈ రోజు గాడిన పడ్డాయి. 10 సెషన్‌లలో 9 సెషన్లు లాభాల్లో ముగిశాయి.
నిఫ్టడీ బ్యాంకు 187 పాయింట్లు ఎగిసి 28,466 వద్ద, మిడ్ క్యాప్ 171 పాయింట్లు లాభపడి 18,353 వద్ద ముగిసింది.
ఐచర్ మోటార్స్ లాభాలు 40 శాతం తగ్గినప్పటికీ, అంచనాలకు మించి లాభాలు ఉన్నాయి. దీంతో ఈ స్టాక్స్ భారీగా పెరిగాయి.
నిఫ్టీ ఆటో 0.30 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.66 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.80 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.26 శాతం, నిఫ్టీ ఐటీ 0.34 శాతం, నిఫ్టీ మెటల్ 1.67 శాతం, నిఫ్టీ ఫార్మా 1.08 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.84 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.34 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.75 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.06 శాతం, నిఫ్టీ మీడియా 0.94 శాతం నష్టాల్లో ముగిశాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications