ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన సూచీలు ఏ దశలోను కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ 185 పాయింట్లు, నిఫ్టీ 66 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించింది. ఆసియా మార్కెట్లు నష్టపోవడంతో సూచీలు కోలుకోలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ మార్కెట్లలో ఉత్సాహం నింపలేకపోయింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న టూరిజం, హెల్త్ రంగానికి భారీ ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

నష్టాల్లో మార్కెట్లు
మెటల్, బ్యాంకింగ్, ఆటో సహా వివిధ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ చివరకు 185.93 (0.35%) పాయింట్లు నష్టపోయి 52,549.66 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 66.25 (0.42%) పాయింట్లు నష్టపోయి 15,748.45 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 52,795.76 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,816.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,477.77 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,807.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,835.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,724.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
మధ్యాహ్నం సమయానికి నేటి టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.79 శాతం, సిప్లా 1.72 శాతం, HUL 1.31 శాతం, ఎన్టీపీసీ 1.25 శాతం, దివిస్ ల్యాబ్స్ 0.97 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐవోసీ 2.44 శాతం, ONGC 1.41 శాతం, హిండాల్కో 2.11 శాతం, కోల్ ఇండియా 1.83 శాతం, కొటక్ మహీంద్రా 1.57 శాతం నష్టపోయాయి.
మధ్యాహ్నం సమయానికి నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC లైఫ్, కొటక్ మహీంద్రా, రిలయన్స్, టాటా స్టీల్, HDFC బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.42 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.61 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.25 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.99 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.05 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.73 శాతం, నిఫ్టీ ఐటీ 0.28 శాతం, నిఫ్టీ మీడియా 0.67 శాతం, నిఫ్టీ మెటల్ 1.22 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.48 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.36 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.03 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.50 శాతం, నిఫ్టీ ఫార్మా 0.58 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications