ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (సెప్టెంబర్ 3) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రానికి నష్టపోయాయి. సెన్సెక్స్ మధ్యాహ్నం నుండి నేల చూపులు చూసింది. ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయింది. మళ్ళీ పుంజుకుంటున్నట్లు కనిపించినా చివరకు నష్టాల్లోకి వెళ్లింది. సెన్సెక్స్ 95.09 పాయింట్లు లేదా 0.24% నష్టపోయి 38,990.94 వద్ద, నిఫ్టీ 7.50 పాయింట్లు లేదా 0.07% పడిపోయి 11,527.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1452 షేర్లు లాభాల్లో, 1199 షేర్లు నష్టాల్లో ముగియగా, 176 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

టాప్ గెయినర్స్.. లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, గ్రాసీమ్, టైటాన్ కంపెనీ, యూపీఎల్, విప్రో ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, హిండాల్కో, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా ఉన్నాయి. అమెజాన్, వెరిజోన్ పెట్టుబడులు పెడుతుందనే వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్లు ఏకంగా 30 శాతం ఎగిసి రూ.12 దాటింది. ఐటీ, ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్, మెటల్ రంగాలు ఒత్తిడికి లోనయ్యాయి.

టెల్కోలు జూమ్
మిడ్ క్యాప్ షేర్లు దాదాపు 1 శాతం ఎగిసిపడ్డాయి. ఐటీ స్టాక్స్ కారణంగా మార్కెట్లు పుంజుకోగా, రిలయన్స్, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ వంటివి లాభాలను కిందకు దించాయి. ఆగస్ట్ నెలలో వెహికిల్ సేల్స్ పెరగడంతో ఆటో షేర్లు భారీగా లాభపడ్డాయి. టెల్కోలకు బకాయిలు చెల్లించేందుకు పదేళ్ల గడువు ఇవ్వడం కలిసి వచ్చింది. దీంతో ఈ రంగం షేర్లు లాభపడ్డాయి. గ్రాసిమ్, టైటాన్, యూపీఎల్, విప్రో, టెక్ మహీంద్రా, నెస్లే, ఐచర్, మారుతీ, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ టాటా మోటార్స్ లాభపడ్డాయి.

బలహీనపడిన రూపాయి
డాలర్ మారకంతో రూపాయి 73.47 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు రూపాయి 44 పైసలు లేదా 0.60 శాతం క్షీణించింది. 73.21 నుండి 73.48 మధ్య ట్రేడ్ అయింది. గత నెలలో 76.91 వద్ద ట్రేడ్ అయిన రూపాయి అప్పటితే పోలిస్తే 4 శాతానికి పైగా రికవరీ అయింది. ఇదిలా ఉండగా, నగదు విభాగంలో నిన్న FPIలు దాదాపు రూ.991 కోట్ల స్టాక్స్ కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్ DIIలు రూ.657 కోట్లకు పైగా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం FPIలు రూ.486 కోట్లని ఇన్వెస్ట్ చేయగా, DIIలు రూ.775 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications