స్టాక్ మార్కెట్లు బుధవారం (సెప్టెంబర్ 29) నష్టాల్లో ముగిశాయి. భారీ నష్టాల్లోనే ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం గం.1 వరకు వరకు కోలుకోలేదు. ఆ తర్వాత భారీ నష్టాల నుండి స్వల్పంగా కోలుకొని, 254 పాయింట్ల నష్టాల్లో ముగిసింది సెన్సెక్స్. నిఫ్టీ కూడా ఓ దశలో లాభాల్లోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ చివరకు 37 పాయింట్లు క్షీణించి ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. చైనాలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ఆసియా సూచీలు మిశ్రమంగా క్లోజ్ అయ్యాయి.
ఐరోపా మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, అమెరికా ఫ్యూచర్ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతుండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు చివరలో భారీ నష్టాల నుండి కాస్త కోలుకున్నాయి. ఉదయం ప్రాఫిట్ బుకింగ్ కూడా భారీ నష్టాలకు కారణం. గత కొద్ది రోజుల ర్యాలీ నేపథ్యంలో కీలక రంగాలు స్థిరీకరణ దిశగా సాగాయి. దీంతో సూచీలు నష్టాల్లో పయనించాయి.

భారీ నష్టాల్లో.. భారీ లాభాల్లో
సెన్సెక్స్ ఉదయం 59,296.54 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,678.66 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,111.41 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,657.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,781.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,608.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 254.33 (0.43%) పాయింట్లు నష్టపోయి 59,413.27 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37.30 (0.21%) పాయింట్లు క్షీణించి 17,711.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.13 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 30 సూచీలో మెజార్టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. HDFC, అల్ట్రా టెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, HDFC బ్యాంక్, HUL, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, ఎస్బీఐ, టైటాన్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, HCL టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
రంగాలవారీగా చూస్తే పవర్, మెటల్, ఫార్మా, రియాల్టీ స్టాక్స్ ఒక శాతం నుండి 3.5 శాతం మేర లాభపడ్డాయి. ఆటో, బ్యాంకు, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
మోస్టా యాక్టివ్ స్టాక్స్‌లో జాబితాలో కోల్ ఇండియా 11.15 శాతం, ఎస్బీఐ 15.10 శాతం, సన్ ఫార్మా 36.20 శాతం, ఇన్ఫోసిస్ 5.15 శాతం లాభాల్లో, HDFC బ్యాంకు 21.20 శాతం నష్టపోయాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ 6.59 శాతం, కోల్ ఇండియా 6.39 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 6.03 శాతం, సన్ ఫార్మా 4.67 శాతం, ఐవోసీ 3.66 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC 2.09 శాతం, కొటక్ మహీంద్రా 1.83 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.68 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.63 శాతం, HUL 1.42 శాతం నష్టపోయాయి.

లక్ష పాయింట్లకు చేరుకోవచ్చు
సెన్సెక్స్ వచ్చే అయిదేళ్ల కాలంలో లక్ష పాయింట్లను తాకవచ్చునని జెఫెరీస్ ఈక్విటీ స్ట్రాటెజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోపర్ వుడ్ అభిప్రాయపడ్డారు. షార్ట్ టర్మ్‌లో కరెక్షన్ రిస్క్ ఉండవచ్చునని, అలాంటి భారీ డిప్ సమయంలో కొనుగోలు చేయవచ్చునని కూడా సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్‌కు అవకాశముందని, కాబట్టి ఇన్వెస్ట్ చేయవచ్చునని సూచించారు. అలాగే, సెన్సెక్స్ కొద్ది నెలల్లో 66,666 పాయింట్లకు చేరుకోవచ్చునని కూడా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications