దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండు రోజుల పాటు భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు నేడు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం లాభాల్లోకి వచ్చినప్పటికీ, రోజంతా కాస్త లాభనష్టాల ఊగిసలాటలో కనిపించి, చివరకు లాభాల్లో ముగిశాయి. మంగళ, బుధవారాలు భారీ లాభాల నేపథ్యంలో నేడు ఉదయం సెషన్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపినట్లుగా కనిపించింది. మధ్యాహ్నం నుండి పరిస్థితి మారింది. మొత్తానికి దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో రోజంతా ఒడిదుడుకుల్లో సాగింది. బ్యాంకింగ్, రియాల్టీ రంగాల నుండి ఒత్తిడి ఎదురైంది.

ఈ రంగాలు ఒత్తిడిలో..
సెన్సెక్స్ నేడు 58,831.41 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,889.96 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,340.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,524.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,543.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,379.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 157.45 (0.27%) పాయింట్లు ఎగిసి 58,807.13 పాయింట్ల వద్ద, నిఫ్టీ 47.10 (0.27%) పాయింట్లు లాభపడి 17,516.85 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్, రియల్టీ, మెటల్ రంగ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐటీసీ 4.65 శాతం, లార్సన్ 3.00 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.26 శాతం, యూపీఎల్ 1.94 శాతం, రిలయన్స్ 1.59 శాతం లాభపడ్డాయి.టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు 1.73 శాతం, టైటాన్ కంపెనీ 1.35 శాతం, నెస్ట్లే 1.00 శాతం, ఎన్టీపీసీ 0.94 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.78 శాతం నష్టపోయాయి.

ఈ స్టాక్స్ జంప్
నేడు మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అయితే పలు స్టాక్స్ పదిహేను శాతం కంటే పైగా లాభపడ్డాయి. ఆ స్టాక్స్‌లో... రీజోనాన్స్ స్పెక్ (20.0%), RR మెటల్ మేకర్స్ ఇండియా (19.98%), MPL ప్లాస్టిక్స్ (19.97%), తిరుపతి సర్జన్ (19.97%), సెంచరీ ఎక్స్‌ట్రస్ (19.96%), నెక్స్ట్ మీడియా వర్క్స్ (19.94%), యాడ్-మానమ్ ఫిన్ (19.9%), WEP సొల్యూషన్ (19.87%), ఆర్టెక్ సొల్యూషన్స్ (19.85%), రిలయన్స్ కామ్(19.8%) లాభపడ్డాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications