ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 3) స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం 350పాయింట్ల భారీలాభంతో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత ఆ లాభాల్ని నిలుపుకోలేకపోయాయి. సెన్సెక్స్ 14.61 పాయింట్లు (0.03%) లాభపడి 44,632.65 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20.10 పాయింట్లు (0.15%) లాభపడి 13,133.90 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1950 షేర్లు లాభాల్లో 905 షేర్లు నష్టాల్లో ముగియగా, 166 షేర్లలో ఎలాంటి మార్పులేదు. పీఎస్‌యూ బ్యాంకు దాదాపు 5 శాతం లాభపడ్డాయి. మెటల్ సూచీ 2 శాతం ఎగిసింది.

రిలయన్స్ స్టాక్ గత కొద్ది రోజులుగా..
టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 7.39 శాతం, ఓఎన్జీసీ 4.54 శాతం, హీండాల్కో 4.38 శాతం, ఏషియన్ పేయింట్స్ 4.13 శాతం, ఎన్టీపీసీ 3.96 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు 2.11 శాతం, SBI లైఫ్ ఇన్సురా 1.99 శాతం, టీసీఎస్ 1.46 శాతం, బజాజ్ ఆటో 1.31 శాతం, ఇన్ఫోసిస్ 1.27 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో మారుతీ సుజుకీ, హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు, రిలయన్స్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు 0.14 శాతం లాభపడి రూ.1960 వద్ద ముగిసింది. రిలయన్స్ స్టాక్ గత కొద్ది రోజులుగా రూ.2000కు దిగువనే ఉంది.
HDFC బ్యాంక్ షేర్ ధర 1.84 శాతం మేర నష్టపోయింది.

రంగాలవారీగా..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీగా నష్టపోవడంతో నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయింది. హెచ్‌డీఎప్‌సీపై ఆర్బీఐ ఆదేశాల ప్రభావం పడింది. మారుతీ సుజుకీ 7 శాతంతో భారీగా లాభపడింది. ఎయిర్ లైన్స్ కెపాసిటీ 80 శాతానికి పెంచడంతో ఇండిగో, స్పైస్ జెట్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.67 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.44 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.28 శాతం, నిఫ్టీ మీడియా 2.80 శాతం, నిఫ్టీ మెటల్ 2.49 శాతం, నిఫ్టీ ఫార్మా 0.98 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4.81 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.83 శాతం లాభాల్లో ముగిశాయి.
నిఫ్టీ బ్యాంకు 0.05 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.34 శాతం, నిఫ్టీ ఐటీ 0.52 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.49 శాతం నష్టాల్లో ముగిశాయి.

అందుకే లాభాల్లో..
సెన్సెక్స్ ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత క్రమంగా తగ్గింది. దీంతో 330 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15 పాయింట్ల లాభంతో ముగిసింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో పాటు కరోనా వ్యాక్సీన్ అభివృద్ధిపై సానుకూల వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీనికి తోడు పైజర్ టీకాను యూకే ప్రభుత్వం అనుమతించడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో మార్కెట్లు లాభాల వైపు పయనించాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications