భారీ నష్టాల నుండి కోలుకున్న సెన్సెక్స్: రిలయన్స్ పెరిగినా.. ఫైజర్‌పై యూకే ఎఫెక్ట్

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం(డిసెంబర్ 2) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఓ సమయంలో 44,220 దిగువకు చేరుకున్న సెన్సెక్స్, ఆ తర్వాత కాస్త కోలుకొని స్వల్ప నష్టాల్లో ముగిసింది. క్రితం సెషన‌లో 44,655 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 44,600కు దిగువన ప్రారంభమై, మధ్యాహ్నం సెషన్లో 44,200 స్థాయిని తాకి చివరకు 44,600 పాయింట్ పైన ముగిసింది. మెటల్ సూచీలు రెండుశాతం, ఆటో రంగం ఒక శాతం లాభపడగా, బ్యాంకింగ్ సెక్టార్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

రిలయన్స్ స్టాక్ అప్

రిలయన్స్ స్టాక్ అప్

సూచీలు నేటి దారుణ పతనం నుండి కోలుకున్నప్పటికీ, నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఆటో, మెటల్ స్టాక్స్ సూచీలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. సెన్సెక్స్ 37.40 పాయింట్లు(0.08%) క్షీణించి 44,618.04 వద్ద, నిఫ్టీ 4.80 పాయింట్లు(0.04%) ఎగిసి 13,113.80 పాయింట్ల వద్ద ముగిశాయి. 1573 స్టాక్స్ లాభాల్లో, 1124 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. 134 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 5.42 శాతం, ఓఎన్జీసీ 4.05 శాతం, ఏషియన్ పేయింట్స్ 3.85 శాతం, టైటాన్ కంపెనీ 3.57 శాతం, అదానీ పోర్ట్స్ 3.40 శాతం లాభాల్లో ముగిశాయి.

టాప్ లూజర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా స్టాక్ 3.29 శాతం, HDFC బ్యాంకు 1.84 శాతం, HDFC 1.33 శాతం, శ్రీసిమెంట్స్ 1.09 శాతం, ICICI బ్యాంకు 0.96 శాతం నష్టాల్లో ముగిశాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ ఉన్నాయి.

రిలయన్స్ స్టాక్ నేడు 0.21 శాతం లాభపడి రూ.1,959 వద్ద క్లోజ్ అయింది.

యూకే ఎఫెక్ట్.. ఫైజర్ స్టాక్స్ జంప్

యూకే ఎఫెక్ట్.. ఫైజర్ స్టాక్స్ జంప్

బ్యాంకింగ్ స్టాక్స్ 1.19 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ సూచీలు 36 నెలల గరిష్టాన్ని తాకాయి. నిఫ్టీ బ్యాంకు 355 పాయింట్లు నష్టపోయి 29,463 వ్ద ముగిసింది. టాప్ 5 లూజర్స్‌లో నాలుగు ఫైనాన్షియల్ స్టాక్స్ ఉన్నాయి. కొటక్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఐసీఐసీఐ ఉన్నాయి.

ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌కు యూకే పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ఫైజర్ స్టాక్స్ 2 శాతం మేర లాభపడింది.

భారతీ ఇన్ఫ్రాటెల్ 4 శాతం ఎగిసింది.

ఐటీ స్టాక్స్ జంప్

ఐటీ స్టాక్స్ జంప్

ఐటీ స్టాక్స్ విషయానికి వస్తే టీసీఎస్ 0.69 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.19 శాతం, ఇన్ఫోసిస్ 0.36 శాతం, విప్రో 1.83 శాతం, మైండ్ ట్రీ 0.15 శాతం లాభపడగా, టెక్ మహీంద్రా స్టాక్ 0.13 శాతం, కోఫోర్జ్ 0.41 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ 50 స్టాక్స్ 0.04 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.41 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.15 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఆటో 1.19 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.37 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.36 శాతం, నిఫ్టీ ఐటీ 0.67 శాతం, నిఫ్టీ మీడియా 0.52 శాతం, నిఫ్టీ మెటల్ 2.56 శాతం, నిఫ్టీ ఫార్మా 0.36 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.96 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ బ్యాంకు 1.19 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.15 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.44 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.17 శాతం నష్టపోయాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+