58,000కు దిగువనే సెన్సెక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ 1 శాతం పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం లాభాల్లోకి వచ్చినప్పటికీ, రోజంతా తీవ్ర ఊగిసలాటలో కనిపించింది. చివరకు నష్టాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాల కారణంగా 1700 పాయింట్లకు పైగా నష్టపోగా, మరుసటి రోజు అంతేస్థాయిలో ఎగిసిపడింది. నిన్న ప్రాఫిట్ బుకింగ్ సహా వివిధ కారణాలతో స్వల్పంగా నష్టపోయి, 58,000 పాయింట్ల మార్కు దిగువకు వచ్చింది. నేడు మరింత క్షీణించింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. దీనికి తోడు బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తి, ఒత్తిడి కనిపించింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, చమురు ధరలపై దృష్టి పెట్టిన ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ట్రేడింగ్ ఒడిదుడుకులను ఎదుర్కొంది. రంగాలవారీగా చూస్తే బ్యాకింగ్ స్టాక్స్ ఒక శాతం వరకు నష్టపోయాయి. పవర్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC స్టాక్స్ జంప్ చేశాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్, టాటా మోటార్స్, HDFC, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, యూపీఎల్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications