ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 29) భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా ఐదో రోజు లాభపడ్డాయి. సెన్సెక్స్ 47,700 మార్కును దాటి, సరికొత్త శిఖరాన్ని తాకింది. అయితే ఆ తర్వాత భారీ లాభాల నుండి కాస్త తగ్గింది. నిఫ్టీ 13,930 పాయింట్లకు పైన ముగిసి, 14000కు చేరువైంది. ఐటీ స్టాక్స్, బ్యాంకింగ్ రంగం మార్కెట్‌ను పైకి లేపింది. దాదాపు గత రెండు నెలలుగా రూ.2,000కు దిగువన ఉంటూ వస్తోన్న రిలయన్స్ స్టాక్ నిన్న రూ.2003 వద్ద క్లోజ్ అయింది. నేడు మళ్లీ 0.81 శాతం పతనమైంది. దీంతో రూ.1987 వద్ద క్లోజ్ అయింది. ఉదయం లాభాల్లో కనిపించినప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది.

సెన్సెక్స్, నిఫ్టీ జంప్
నేడు సెన్సెక్స్ 259.33 పాయింట్లు(0.55%) లాభపడి 47,613.08 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 59.40 పాయింట్లు(0.43%) ఎగిసి 13,932.60 పాయింట్ల వద్ద ముగిసింది. 1519 షేర్లు లాభాల్లో, 1438 షేర్లు నష్టాల్లో ముగియగా, 162 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి నేడు 8 పైసలు బలపడి 73.42 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు పెరగడంతో రూపాయి బలపడింది. నేడు 73.34-73.44 మధ్య ట్రేడ్ అయింది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 5.30 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.03 శాతం, టెక్ మహీంద్రా 1.96 శాతం, HDFC 1.72 శాతం, ICICI బ్యాంకు 1.67 శాతం లాభాల్లో ముగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా 1.85 శాతం, NTPC 1.84 శాతం, నెస్ట్లే 1.80 శాతం, హిండాల్కో 1.79 శాతం, టాటా మోటార్స్ 1.56 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు, రిలయన్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.

రంగాలవారీగా చూస్తే...
సెన్సెక్స్, నిఫ్టీ ఈ డిసెంబర్ నెలలో 14వసారి లాభాల్లో ముగిసింది. నిఫ్టీ బ్యాంకు 442 పాయింట్లు లాభపడి 31,323 పాయింట్ల వద్ద ముగియగా, మిడ్ క్యాప్ సూచీ 23 పాయింట్లు క్షీణించి 20,696 పాయింట్లు లాభపడింది. వరుసగా నాలుగు రోజుల పాటు లాభపడిన టాటా మోటార్స్ నేడు నష్టపోయింది. బర్గర్ కింగ్ స్టాక్స్ వరుసగా మూడో రోజు నష్టపోయాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్ 0.43 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.15 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 0.25 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.62 శాతం, నిఫ్టీ మీడియా 1.45 శాతం, నిఫ్టీ మెటల్ 1.09 శాతం, నిఫ్టీ ఫార్మా 0.24 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.29 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ బ్యాంకు 1.43 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.03 శాతం, నిఫ్టీ ఐటీ 0.72 శాతం, నిఫ్టీ పీఎస్‌యు బ్యాంకు 0.89 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.55 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ దాదాపు మార్పులేదు.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications