ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగాప్రారంభమైన సూచీలు ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమై, మధ్యాహ్నం భారీగా నష్టపోయి, చివరలో కాస్త కోలుకున్నాయి. దీంతో 86 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ క్లోజ్ అయింది. అమెరికా మార్కెట్లు గత వారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగానే కదలాడాయి. అమెరికాలో బాండ్ యీల్డ్స్ మళ్లీ పెరగవచ్చుననే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటుని దెబ్బతీశాయి.

సెన్సెక్స్ పడి'లేచి'
అమెరికా బాండ్ యీల్డ్స్, కరోనా సెకండ్ వేవ్ వంటి అంశాలు సూచీలపై ప్రభావం చూపాయి. కీలక కంపెనీల షేర్లు కూడా కుంగిపోయాయి. సెన్సెక్స్ నేడు 49,878.77 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,878.77 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,281.02 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేటి కనిష్టం నుండి సెన్సెక్స్ 500 పాయింట్లు పైకి చేరింది. అయినప్పటికీ నష్టాల్లో ముగించింది. నిఫ్టీ 14,736.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,763.90 వద్ద గరిష్టాన్ని, 14,597.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా మోటార్స్, అదాని పోర్ట్స్, ICICI బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.19 శాతం, బ్రిటానియా 2.82 శాతం, టీసీఎస్ 2.60 శాతం, టెక్ మహీంద్రా 2.44 శాతం, సన్ ఫార్మా లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 4.32 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.89 శాతం, ICICI బ్యాంకు 2.25 శాతం, టాటా మోటార్స్ 1.91 శాతం, HDFC బ్యాంకు 1.89 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.05 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.99 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.45 శాతం, నిఫ్టీ ఆటో 0.65 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.63 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.15 శాతం, నిఫ్టీ మీడియా 0.99 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.08 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.70 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.03 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.70 శాతం, నిఫ్టీ ఐటీ 1.85 శాతం, నిఫ్టీ మెటల్ 0.91 శాతం, నిఫ్టీ ఫార్మా 1.57 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.70 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications